Site icon Polytricks.in

సోనుసూద్ ను తిట్టిపోస్తోన్న పోలీసులు – ఎందుకంటే..?

కరోనా విలయతాండవం చేస్తోన్న సమయంలో ఎంతోమందిని ఆదుకొని ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందారు బాలీవుడ్ నటుడు సోనుసూద్. ప్రభుత్వాలు కూడా సాయం అందించడం లేదని ఏ సాయం కావాలన్న సోనుసూద్ ను సంప్రదిస్తే కావాల్సిన సాయం అందుతుందన్న నమ్మకం జనాల్లో ఏర్పడింది. దీనినిబట్టి కరోనా సమయంలో ఆయన ఎలాంటి సహాయ, సహకారాలు అందించాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన సేవలకు గాను పలు చోట్ల దేవుడిని చేసి సోనుసూద్ కు గుడులను నిర్మించారు.

కరోనా వారియర్ సోనుసూద్ ను అభిమానించని వారే లేరు. అలాంటిది ఈ మధ్య ఆయన చేసిన ఓ పని చూసి సోషల్ మీడియాలో సోనుసూద్ ను తిట్టిపోస్తున్నారు. నార్నర్త్ రైల్వే, ముంబై పోలీస్ కమిషనరేట్ అతడిని మందలించింది. కదులుతున్న రైలు డోర్ తీసి ఫుట్ బోర్డ్ పై కూర్చొని ప్రయాణం చేసిన సోనూ సూద్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 13వ తేదీన తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియోలో సోనూ.. వేగంగా వెళ్తున్న రైలులో డోర్ పక్కన కాళ్లపై ప్రమాదకరమైన రీతిలో కూర్చున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పోలిసుల కంటపడటంతో నార్నర్త్ రైల్వే పోలీసులు స్పందించారు. ఇది చాలా ప్రమాదకరం అంటూ నటుడిని మందలించింది. జనవరి 4న తమ ట్విట్టర్ ఖాతాలో సోనూసూద్‌పై విమర్శలు గుప్పించింది. భారత ప్రజలకు సోనూ సూద్ స్ఫూర్తి వంతమైన వ్యక్తి అని, ఇలాంటి వీడియోతో దేశానికి తప్పుడు సందేశం ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంది. ఇలా చేయొద్దని విజ్ఞప్తి చేసింది,.

ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా సోనూసూద్‌ను హెచ్చరించింది. ఇది ప్రమాదకరమని, రియల్ లైఫ్ లో అలా చేయరాదని పేర్కొంది. ఎంతో మందికి సాయం చేసి, స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఇలా ప్రమాదకరమైన పనులు చేయకూడదని సూచించారు.

Exit mobile version