Site icon Polytricks.in

నవీన్ హత్యకేసు : పోలీసులను సైతం ఫూల్స్ చేసిన హరి గర్ల్ ఫ్రెండ్..?

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని స్నేహితుడు నవీన్ ను హత్య చేసిన హారిహరకృష్ణను విచారించిన పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు హారిహారకృష్ణ స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారికరెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో హరికి సహకరించడమే కాకుండా నవీన్ ను హత్య చేసినట్లు తెలిసినా దాచి పెట్టినందుకు ఈ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రియురాలు నిహారిక కోసమే నవీన్ ను హత్య చేసినట్లు కస్టడీలోనున్న హారి చెప్పాడు. దీంతో పోలీసులు నిహారికను ఈ కేసులో నిందితురాలిగా చేర్చి కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిహారికతోపాటు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌ను కూడా రెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హాసన్, ఏ3గా నిహారిక పేర్లు చేర్చారు.

నవీన్ ను హత్య చేసిన అనంతరం హారిహరకృష్ణ ప్రేయసి నిహారికకు హత్య విషయం చెప్పాడు. ఫోటోలు కూడా ఆమెకు పంపాడు. అయినప్పటికీ ఈ హత్య విషయం పోలీసులకు చెప్పకుండా నిహారిక దాచిపెట్టింది. హత్య చేసిన ప్రాంతం నుంచి నిహారిక వద్దకు చేరుకున్న హరికి ఆమె 1500 ఇచ్చినట్లు తెలిపారు పోలీసులు. నవీన్ హత్యకు నిహారిక పరోక్షంగా సహరించినట్లు తెలియడంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Also Read  : నవీన్ హత్యకు హారి ప్రియురాలి హెల్ప్.. పోలిసులు ఏమన్నారంటే..?

నవీన్‌ ను హత్య చేసిన తర్వాత హరి.. తన మిత్రుడు హాసన్‌ రూమ్‌ కి వెళ్లాడు. రక్తపు మరకలున్న తన వస్తలను హసన్ ఇంటి వద్దే శుభ్రపరుచుకున్నాడు. నవీన్ ను హత్యచేసినట్లు అతడికి అప్పుడే చెప్పాడు. అయినప్పటికీ హసన్ కూడా ఈ విషయం పోలీసులకు చెప్పకుండా దాచి పెట్టాడు.దీంతో హసన్ ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు.

Also Read  : ప్రీతి మృతిపై సందేహలెన్నో…ఈ 11సందేహాలకు సమాధానమేది..?

ఇన్ని రోజులు తమకు ఈ హత్య గురించి ఏమాత్రం తెలియదని నిహారిక చెప్పింది. హసన్ కూడా ఇదే విషయం చెప్పాడు. అనవసరంగా తన పేరును ఈకేసులో ఇన్వాల్వ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కానీ పోలిసుల కస్టడీలోనున్న హారి ని విచారిస్తే అసలు విషయం మొత్తం బయటపడింది.

Also Read  : నవీన్ మర్డర్ కేసు – హరిహరకృష్ణ సమాధానాలకు పోలీసులు షాక్

Exit mobile version