కిసాన్ క్రాంతి యాత్ర పై లాఠీ ఛార్జ్, బాష్ప వాయు గోలాల ప్రయోగం

#KisanKrantiYatra

దేశంలో రైతుకు ఈ దుస్థితి ఎందుకు..? గాంధీ జయంతి రోజే..అహింసను బోధించిన మహాత్ముని జయంతి రోజే.. రైతుల రక్తం కళ్ల జూసిందెవరు..?

ఢిల్లీలో రైతులపై లాఠీ విరిగింది. డిమాండ్లతో… వెల్లువలా తరలి వచ్చిన రైతుల్ని.. కంట్రోల్ చేయడానికి లాఠీలు ఝుళిపించారు……..

బాష్పవాయుగోలాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో తరిమికొట్టారు. కానీ ఇలా చేస్తే.. రైతుల నిరసన ఆగిపోతుందా.. ? అది దేశం మొత్తం వ్యాపిస్తుంది. అందులో ఎలాంటి సందేహమే లేదు.రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చి పెడతామన్న కేంద్రం హామీని నమ్మి నట్టేట ముగిసిన రైతులు.. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి సేకరించిన పంటకు యూపీలో డబ్బులు ఇవ్వడం లేదు. మిగతా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి.
రైతులకు ముంచి చేస్తామని చెప్పి ముంచినందుకే రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు ర్యాలీ దేశరాజధానిలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవడం, రైతులను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతులపై కేంద్ర ప్రభుత్వ అణిచివేత వైఖరిని తప్పు పడుతున్నారు. మోదీ సర్కార్ రైతు వ్యతిరేకి అనే విషయం మరోసారి రుజువైందటున్నారు. రైతులు సంక్షోభం నుంచి బయటపడేందుకు, రుణవిముక్తులయ్యేందుకు, మరిన్ని చావులు చోటుచేసుకోకుండా ఉండేందుకు వారికి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. . ఇంతటి రైతు దమన వైఖరిని స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తాము చూడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజధానిలో రైతు ర్యాలీని అడ్డుకున్న తీరు స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిష్ పాలకుల అణిచివేత ధోరణిని గుర్తు చేసిందని అంటున్నారు. మహాత్మాగాంధీ జయంతి నాడు బ్రిటిష్ పాలకులకు తామేమాత్రం తీసిపోమని మోదీ ప్రభుత్వం చాటుకుంటుదంటున్నారు. రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, అందువల్ల సహజంగానే రైతులు నిరసన తెలుపుతున్నారు. దానిపై ఉక్కుపాదం మోపడం ఎందుకనేది చాలా మందికి ్ర్థం కాని ప్రశ్న. రైతుల నిరసనలను అణిచివేసే ప్రయత్నం పై అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *