Site icon Polytricks.in

అయ్యో అదాని … పెయిడ్ బ్యాచ్ తో దొరికిపోయావ్ గా…!

గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక రిలీజ్ కాగానే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయన అడ్డాదారిలో సంపాదించారని ఆ నివేదికతో ఓ స్పష్టత వచ్చింది. అదానీ వ్యాపారంపై హిండెన్ బర్గ్ నివేదిక గురించే ప్రధాన చర్చ. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనూ బడ్జెట్ కు ఏమాత్రం తీసిపోకుండా హిండెన్ బర్గ్ నివేదికపై చుట్టూ చర్చ జరగడం విశేషం.

నిజానికి..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అప్పులు తీసుకొని పోర్టులు, అయిర్ పోర్టులు , ట్రైన్లు ఇలా కనిపించవన్నీ కొనిపడేశారు అదానీ. చివరికీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే ఎన్డీటీవీని కూడా కొనేశారు. వీటన్నింటిని కొనుగోలు చేసేందుకు అదానీ దగ్గర బోలెడంత డబ్బు ఉంది కాని ,అమ్మేవారు ఎలా అమ్ముతున్నారు…?లాభాలు దండిగా వస్తున్నా ఆ సంస్థలను విక్రయిస్తున్నారంటే వారిపై ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయనేది అందరి సందేహం.

ఎయిర్ పోర్టులు, పోర్టులు, మీడియా కంపెనీలను అదానీ కొనడం వెనుక ఎవరి సహకారం ఉందొ అందరికీ తెలుసు. కేంద్ర పెద్దల డైరక్షన్ లోనే ఇవి అదానీ గుప్పిట్లోకి వెళ్ళాయి. అదానీ ఇలా జెట్ స్పీడ్ తో సంపన్నుల జాబితాలోకికెక్కడం వెనక రాజకీయ నేతల సహకారం ఉంది. ఈ రాజకీయం వల్లనే ఇప్పుడు రిస్క్ వచ్చి పడింది. జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చి అదానీని సేవ్ చేయాలనుకుంటే ఆర్ధిక వ్యవస్థకు డేంజర్. అలా కాదని అదానీపై చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్ళేలా ఉంది. ఈ విషయాన్నీ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తోంది కేంద్రం.

ఇకపోతే…. హిండెన్ బర్గ్ నివేదిక దేశంపై దాడి అంటూ అదానీ జాతీయవాదాన్ని ఎత్తుకొని ప్రజలను ఫూల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. నిజంగా.. హిండెన్ బర్గ్ నివేదికపై దేశంపై దాడి అయితే.. అదానీ సొమ్మంతా దేశ ప్రజలదే కావాలి. ఇందుకు ఆయన అంగీకరిస్తారా..? హిండెన్ బర్గ్ నివేదికపై తెరవెనక జరుగుతోన్న దాడి అదానీ గ్రూప్ పరువు తీసింది.

indiastandswithadani అనే హ్యాష్ ట్యాగ్ తో దేశమంతా అదానీకి అండగా ఉందని చెప్పాలనుకున్నారు. అందుకోసం ట్వీట్లు పెట్టి వైరల్ చేయాలనుకున్నారు. కాని దొరికిపోయారు. NATION స్పెల్లింగ్ ని NATIOIN అని రాసి దొరికిపోయారు. వాటిని స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశాడు హిండెన్ బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్. అదాని మీద దాడి దేశం మీద దాడి అని రెచ్చిపోయి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ తో పరువు తీసుకున్నారు. ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనేనని అంటున్నారు.

Exit mobile version