Site icon Polytricks.in

బ్రేకింగ్ – పవిత్రను పెళ్లి చేసుకున్న నరేష్ – వీడియో వైరల్

గత కొద్ది కాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తోన్న సీనియర్ నటుడు నరేష్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త తెగ చక్కర్లు కొడుతోంది. ఐతే.. పవిత్రతో పెళ్లి జరిగిన తేదీని మాత్రం నరేష్ ప్రకటించలేదు.

నరేష్ పోస్ట్ చేసిన పెళ్లి వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి కృష్ణ మరణించి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే పెళ్లి ఎలా చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధ లేకుండా పవిత్రతో పెళ్లికి ప్రాధాన్యత ఇస్తారా..? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూడో భార్య రమ్యతో విడాకులు తీసుకోలేదు అప్పుడే పవిత్రతో పెళ్లి పీటలు ఎలా ఎక్కుతారని అంటున్నారు.

మరోవైపు..కృష్ణ మరణించిన సమయంలోనూ నరేష్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని కొందరు గుర్తు చేస్తున్నారు. కృష్ణ పార్ధివదేహం ముందే పవిత్రతో కలిసి ఇతరులకు ఇబ్బంది కల్గించేలా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. కృష్ణ సంస్మరణ సభలో నరేష్ , పవిత్ర లోకేష్ ల వ్యవహారశైలి చూసి చాలామంది అసహించుకున్నారని ఇందుకు సంబందించిన వీడియోలను కూడా బయటపెట్టారు. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీని నరేష్ కలుసుకోలేదని అంటున్నారు.

తాజాగా నరేష్ పెళ్లి చేసుకున్న వీడియోను విడుదల చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సొంత తండ్రి కాకపోయినా సొంత కొడుకులా ఆదరించిన కృష్ణ మరణించి ఏడాది కూడా కాకముందే నరేష్ పెళ్లి చేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఇకపోతే.. నరేష్ వివాహ వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ పాల్గొనలేదని తెలుస్తోంది.

ఇక తాము ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఇదివరకే చెప్పిన నరేష్, పవిత్ర లు త్వరలో తాము పెల్లి చేసుకుంటామని ఇదివరకే ప్రకటించారు. అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నది తెలియకపోయినా అందుకు సంబంధించిన వీడియోను నరేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయింది.

Exit mobile version