Site icon Polytricks.in

ప్రాణహాని ఉందంటూ కోర్టు మెట్లెక్కిన నరేష్

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన మూడో భార్య రమ్యతో ప్రాణహాని ఉందంటూ కోర్టులో నరేష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిందంటూ కోర్టును ఆశ్రయించారు.

కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ రాకేశ్ శెట్టితో తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు నరేష్. కృష్ణ మరణించిన సమయంలోనే ఈ రెక్కీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అంతేకాదు..ఓ పోలీసు అధికారి సహాయంతో తన ఫోన్ ను హ్యాక్ చేసిందన్నారు.

నరేష్, పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. వాళ్ళ పెళ్లి జరగనివ్వని.. తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటారని రమ్య ప్రశ్నిస్తోంది. నరేష్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని.. తన కొడుకు తండ్రి కావాలని కోరుతున్నాడని చెప్పుకొచ్చింది.

మా విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది. ఎంత కష్టమైనా పోరాటం చేస్తాను. నరేష్ తోనే కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తానని రమ్య చెప్పారు. ఈ నేపథ్యంలోనే నరేష్ తనకు రమ్య నుంచి ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version