Site icon Polytricks.in

ప్రధాని మోదీ తల్లి కన్నుమూత

భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురైన హీరాబెన్ ను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.30గంటలకు తుదిశ్వాస విడిచారు.

తన తల్లి మృతి మరణించినట్లు ప్రధాని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. వందేళ్ళ అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని తల్లి గురించి పేర్కొన్నారు. ఆమె నిస్వార్ధ కర్మయోగి అని, ఆమె జీవితం మొత్తం విలువలతోనే నిండిందని చెప్పారు.

తన మాతృమూర్తి వందో పుట్టిన రోజున తనను కలిసినట్లు ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. తనను కలిసినప్పుడల్లా ఓ విషయాన్ని చెప్పేవారని పేర్కొన్నారు. జీవితాన్ని స్వచ్చంగా గడపాలని, విజ్ఞతతో వ్యవహరించాలని చెప్పేవారని తెలిపారు.

ప్రధాని ఎప్పుడు తన మాతృమూర్తి గురించి చెప్పేవారు. తనతోనున్న బంధాన్ని నెమరువేసుకునే వారు. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన తల్లిని కలిసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలియగానే అహ్మదాబాద్ వెళ్లి ఆసుపత్రీకి వెళ్లి తల్లిని పరామర్శించారు.

Exit mobile version