Site icon Polytricks.in

బిగ్ బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ రియాల్టీ షో పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ షో సాంఘీక దురాచారం వంటిదని మండిపడ్డారు.

బిగ్ బాస్ హౌస్ ను గతంలో బ్రోతల్ హౌస్ తో పోల్చిన నారాయణ ఆ షో ను రద్దు చేసే వరకు తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. షో ను రద్దు చేయాలని ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదని.. టీఎస్ హైకోర్టు కూడా తన పిటిషన్ ను విచారణకు స్వీకరించలేదని చెప్పారు.

తన పిటిషన్ ను ఏపీ హైకోర్టు స్వీకరించిందని…అందుకు ఏపీ హైకోర్టుకు దాన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు నారాయణ. ఈ షో ద్వారా అశ్లీల కంటెంట్ జనాల్లోకి వెళ్తుందని చెప్పారు.

Exit mobile version