Site icon Polytricks.in

చిరు, బాలయ్య సినిమాలతో కుల ఘర్షణలు – నారా లోకేష్ ఏం చెప్పారంటే..?

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలను వాడుకునేందుకు ఈ సినిమాలను అడ్డుపెట్టుకొని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు అధికార పార్టీ కాచుకుకూర్చుకుందని..ఇద్దరు హీరోల అభిమానులు అలర్ట్ గా ఉండాలని నారా లోకేష్ సూచించారు.

సినిమాలనేవి వినోదం కోసమేననే విషయాన్ని గుర్తించాలని నారా లోకేష్ సూచించారు. ఈ రెండు సినిమాలపై దుష్ప్రచారం చేస్తు సోషల్ మీడియా ప్రచారాలతో ఒకరి ఫ్యాన్స్ పై మరొకరి ఫ్యాన్స్ ను ఉసిగొల్పే ప్రమాదం ఉందని అలాంటి వారి ఉచ్చులో చిక్కుకోవద్దని లోకేష్ చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏపీలో అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన చేయవచ్చుననే విధంగా ఉన్నాయి.

వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలు బాగా ఆడాలని లోకేష్ ఆకాంక్షించారు. సినిమాలను తాను చూస్తానని అభిమానులు కూడా చూడాలని అన్నారు. కాకపోతే ఈ సినిమాలను రాజకీయాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని.. వారి ట్రాప్ లో పడొద్దని హితవు పలికారు. కులాల మధ్య కుంపట్లకు తెరలేపెందుకు ఈ సినిమాలను రాజకీయ లబ్ది కోసం వైసీపీ వాడుకునే ప్రమాదముందని.. అందుకే ఈ సినిమాలను వినోదం పంచె సినిమాలుగా ట్రీట్ చేయాలన్నారు.

నిజానికి , నారా లోకేష్ ఇలాంటి సూచనలు చేసేందుకు కారణం ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల భేటీ తరువాత రెండు వర్గాల మధ్య రచ్చ స్టార్ట్ చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా కసరత్తు చేస్తోంది. ఓ వివాదాస్పద వ్యక్తితో మూడు రోజులుగా ట్వీట్లు పెట్టించి వాటిని టీవీల్లో చర్చలకు కూడా పెట్టారు. కాని అవేవి వైసీపీ కోరుకున్నట్టుగా హైలెట్ కాలేదు.

ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తరువాత ఐ ప్యాక్ టీం వేల కొద్ది ఫేక్ అకౌంట్లతో ఫ్యాన్స్ మధ్య గొడవలకు కారణం అవుతుందని..క్రమంగా ఇది కుల ఘర్షణలకు దారి తీసేలా చేస్తారన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అంచనా వేసిన లోకేష్..వైసీపీ ట్రాప్ లో పడొద్దని సూచిస్తున్నారు.

Exit mobile version