Site icon Polytricks.in

అస్వస్థతకు గురైన యంగ్ హీరో – ఆసుపత్రికి తరలింపు

టాలీవుడ్ కు ఈరోజు ఏమాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఇప్పటికే అనారోగ్యంతో సూపర్ స్టార్ కృష్ణ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరగా.. తాజాగా యువ హీరో ఆసుపత్రి పాలయ్యాడు.

యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడు. షూటింగ్ లో ఉండగా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగ శౌర్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ యంగ్ హీరో ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

ప్రస్తుతం నాగ శౌర్య చేస్తోన్న సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన డైట్ మెయింటేన్ చేస్తున్నాడు. సరైన ఆహరం తీసుకోకపోవడం వలన అస్వస్థతకు గురై ఉండొచ్చునని మూవీ యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నారు.

Exit mobile version