Polytricks.in

సమంత గర్భం దాల్చితే చైతూ అబార్షన్ కూడా చేయించాడా… అందుకేనా విడిపోయింది..?

సమంత, నాగ చైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా ఈ జంట పేరు సంపాదించుకుంది. కానీ పెళ్ళైనా నాలుగేళ్ళకే తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశారు. వీరు విడిపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో ఏమో కాని చైతూ, సామ్ అభిమానులు మాత్రం ఏడ్చేశారు. మీరు విడిపోవద్దు.. కలిసి ఉండండి అంటూ సోషల్ మీడియాలో వీరి పేర్లకు ట్యాగ్ చేసి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

2021 అక్టోబర్ 2వ తేదీన తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చైతన్య, సమంత. విడాకులు తీసుకొని ఏడాదిన్నర అవుతోంది కానీ ఇప్పటికీ ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. సమంతే మొదట విడాకులు కోరిందని కొందరు… చైతూనే సమంత బిహేవియర్ నచ్చక విడాకులు కోరాడని మరికొందరు. ఇలా ఎవరికీ తోచినట్లు వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

విడాకులకు కారణం ఏంటో ఇంతవరకు చైతూ చెప్పలేదు. సమంత కూడా నోరు విప్పలేదు. దీంతో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇదే అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్య వేధింపుల కారణంగానే సమంత ఆయనతో విడిపోయారంటూ సెన్సార్ సభ్యుడు, సినీ విమర్శకుడు ఉమైర్ సంధు పెట్టిన ట్వీట్ సెన్సేషనల్ గా మారింది.

ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ… సమంత తన అభిప్రాయాలను వ్యక్తపరిచినట్లుగా పేర్కొన్నాడు. నాగ చైతన్య ఓ బ్యాడ్ హస్బెండ్. మానసికంగా, శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతని వేధింపులు తట్టుకోలేకే, విడిపోయాను అని సమంత చెప్పినట్లు ఉమర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ ట్వీట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ వర్గాల్లో చై,సామ్ డివర్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

Also Read : సినీ ఇండస్ట్రీలో కలవరం – అనుష్క, రేణు దేశాయ్ లకు ఏమైంది…?

Exit mobile version