Site icon Polytricks.in

అమ్మా! ఎందుకే నీ కన్నపేగుకై పరితపిస్తావు?

(టర్కీ భూకంపంలో తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి)

అమ్మ! ఎందుకే నీ ఊపిరి నాకు ఊపిరిగా పోశావు
బతికినంత కాలం గుండెనిండా ఊపిరి పోసుకోమని గాలి నిచ్చావు!

ఎందుకే నాకు కడుపునిండా పాలిచ్చావు
బతికినంత కాలం బొజ్జ నిండా తినమని పాడిపంటలిచ్చావు!

ఎందుకే నాకు లాలపోసి జోలపాడావు
బతికినంత కాలం ఆడుకోమని నది జలాలనిచ్చావు!

ఎందుకే నన్ను నవమాసాలు మోశావు
బతికినంత కాలం నన్ను మోయమని నెల నిచ్చావు!

ఆ నేలతల్లి నన్ను కలకాలం మోయానని కంపించింది.
టర్కీని నేల కడుపులో దాచుకుంది
బతికినోళ్లకు పురిటినొప్పులు మిగిల్చింది.

నీ గర్భంలో ఉన్న నన్ను
కాలగర్భంలో కలిసిపోకుండా
కడవరకు పోరాడవు!

నన్ను నీ గర్భంలోంచి బయటపడేసే
నువ్వు మాత్రం కాలగర్భంలో కలిసిపోయావు!

అమ్మ! ఎందుకే నీకు ఇంత నిస్వార్ధం
నీ కన్నపేగుకై గుండె పేగులు ఎలా తెంచుకున్నావు?
– మోహన రావు దురికి

 

టర్కీ భూకంపంలో ఓ నిండు గర్భిణీ శిథిలాల కింద చిక్కింది. తన బిడ్డకు దెబ్బ తగలకూడదని చిన్న బోనుల్లో చిక్కింది. అప్పుడే పురిటి నొప్పులు వచ్చాయి, తన కాన్పు తానే చేసుకుంది. తన బొడ్డు తానే కోసుకుంది. ఆ శిశువుకు మైల కూడా తీయలేని పరిస్థితి. పాలు కూడా ఇవ్వలేని దుస్థితి. రెస్కీ టీం వచ్చేవరకు కోన ఊపిరి బిగపట్టి శిశువును కాపాడింది. వాళ్లు రాగానే ఆ శిశువును అప్పగించి సంతోషంగా ఊపిరి వదిలి ఈ లోకం విడిచిపోయింది. ఇలాంటి తల్లులు ఉన్నారు కాబట్టే అమ్మ ప్రేమ ఇంకా బతికుంది.

Exit mobile version