Site icon Polytricks.in

అస్వస్థతకు గురైన మోదీ తల్లి

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆమె మంగళవారం రాత్రి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దాంతో ఆమెను అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

2022 జూన్ లో మోడీ తల్లి 99వ వడిలోకి అడుగు పెట్టారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో మోడీ తన తల్లిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలోనే ఆమె అస్వస్థతకు గురవ్వడంతో తల్లిని చూసేందుకు మోడీ అహ్మదాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ లో సెక్యురిటిని పెంచారు.

ఇదిలా ఉండగా.. మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కారులో ప్రయాణిస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆయన కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారు. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version