Site icon Polytricks.in

మంచు విష్ణు డ్రామా -మరోసారి షాక్ ఇచ్చిన మనోజ్

మంచు వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇటీవల జరిగిన గొడవంతా ఓ రియాలిటీ షో ప్రమోషన్ కోసమనేనని చెప్పి దొరికిపోయారు. తాము చేసిందంతా ప్రాంక్ అంటూ జరిగిన గొడవను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు విష్ణు. కానీ మంచు లక్ష్మి, మనోజ్ లు స్పష్టత ఇవ్వడంతో విష్ణు ఇరకాటంలో పడ్డారు.

తామంతా త్వరలోనే ఓ భారీ రియాలిటీ షో చేస్తున్నామని..దాని ప్రమోషన్ లో భాగంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు డ్రామా నడిపామని పరోక్షంగా విష్ణు చెప్పాడు. ‘హౌస్ ఆఫ్ మంచూస్ ‘అనే రియాలిటీ చేస్తున్నామన్నారు. ‘హౌస్ ఆఫ్ మంచూస్’ టైటిల్ తో ప్రోమో కూడా విడుదల చేశారు విష్ణు. దీనిపై మంచు లక్ష్మి, మనోజ్ లను స్పష్టత కోరగా తమకు ఈ విషయమే తెలియదని చెప్పడంతో విష్ణు చెప్పేదంతా ఫేక్ అని తేలింది.

మనోజ్ ను ఈ విషయమై వివరణ కోరగాఇటీవల విష్ణుతో గొడవ జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తన ఫ్రెండ్ పై విష్ణు దాడి చేశాడని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. విష్ణు రియాలిటీ షో చేస్తున్నట్లు తమకు సమాచారం లేదని చెప్పాడు. మంచు లక్ష్మి,మంచు మనోజ్ వ్యాఖ్యలను చూస్తుంటే విష్ణు చెప్తున్నదంతా అబద్దమని తేలింది. జరిగిన ద్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకే విష్ణు ఇటీవలి గొడవను ప్రాంక్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

Also Read  : మంచు మనోజ్ పైన మంచు విష్ణు దాడి ఎందుకు చేశాడో తెలుసా .. ?

Exit mobile version