Site icon Polytricks.in

మహేష్ బాబు, రజనీకాంత్ ల మీద ద్వజమెత్తిన మురుగుదాస్?

‘గజని’ లాంటి గొప్ప కళాకండాన్ని తీసిన తమిళ దర్శకుడు మురుగుదాస్ ఒకప్పుడు స్టార్ దర్శకుడు. అతనికి డేట్లు ఇవ్వడానికి దేశంలోని అందరు స్టార్ హీరోలు అతని ఇంటిముందు క్యూ కట్టారు. అది మొన్నటి వరకు. ఇప్పుడు అతను ఫోన్ చేసినా ఏ హీరో కూడా లేపడం లేదు. అదీ ‘స్టార్’ దర్శకుల దుస్టితి. స్టార్ లు రాత్రి మాతమే కనిపిస్తాయి. వెలుతురూ వస్తే మాయమవుతాయి. అలాగే స్టార్ డైరెక్టర్ లకు హిట్లు ఉన్నప్పుడే అందరికీ కనిపిస్తారు. అపజయం అనే ఫెడ్ అవుట్  కాగానే ఎవ్వరికీ కనిపించరు. దానికి మురుగుదాస్ మినహాయింపు కాదు.

నేడు మురుగుదాస్ కథ చెప్పినా వినడానికి ఏ హిరో ముందుకు రావడంలేదు. అందుకే ఒళ్ళు మండిన అతను సొంత బ్యానర్ మీద నిర్మాతగా మారి ‘1947 ఆగస్టు 16’ అనే చిన్న సినిమా తీసారు. అది ఈ వారం విడుదల అవుతోంది. స్వంతత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 16 ఒక్కరోజు ఓ పల్లెటూరిలో ఏమి జరిగిందో అన్న నేపథ్యంలో సాగే చిన్న సినిమా.

ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పెద్దగా వార్తలు రాలేదు. వచ్చిన వార్తలు వైరల్ కాలేదు. అందుకే ‘వైరల్’ వార్తలకు పెద్ద పీట వేసే మురుగుదాస్ కావాలని మహేష్ బాబు, రజనీకాంత్ మీద ఆరోపణలు చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

రజనికాంత్ తో తీసిన ఏకైక సినిమా ‘దర్బార్’. ఇది అట్టర్ ఫ్లాప్ సినిమా. దీనికి కారణం ఆ రోజుల్లో రజనికాంత్ రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు. ఇచ్చిన డేట్లు సగానికి కుదించాడు. రజనికాంత్ సినిమాకు బిల్డ్అప్ షాట్లు అధికంగా ఉంటాయి. కానీ అలాంటి షార్ట్ లు లేకుండా సినిమాను చుట్టేసేలా నాతో తియించాడు అని మురుగుదాస్ బాధ పడ్డారు. ఇది విని రజనికాంత్ తలపట్టుకున్నాడు.

ఇక మహేష్ బాబుతో మురుగుదాస్ తీసిన ఏకైక సినిమా ‘స్పైడర్’. ఇది మహేష్ కెరియర్ లోనే అతిపెద్ద అట్టర్ ఫ్లాప్ సినిమా. దీనికి కారణం మహేష్ బాబుకు, మురుగదాస్ కు మధ్య తేడాలు రావడమే. ముందుగా కథ చెప్పినప్పుడు మహేష్ బాబు పాత్ర పెద్దగా ఉన్నది. కానీ సినిమా తీసే టప్పటికి మహేష్ బాబు పాత్రను కుదించి, విలన్ పాత్ర పోషించిన ఎస్ జె సూర్య పాత్రను అమాంతం పెంచాడు.

”ఇందులో హీరో ఎవరు?” అని మహేష్ బాబు కోపంతో అడిగారు. మురుగదాస్ దానికి సమాధనం చెపుతూ  ”మీకు తెలుగులో మార్కెట్ ఉంది. తమిళ్ లో లేదు. నాకు లేదు. కానీ నాకు, జె ఆర్ సూర్యకు తమిళ్ మార్కెట్ ఉంది. తెలుగులో సినిమా ఆడకపోయినా పర్వాలేదు, తమిళ్లో ఆడితే చాలు” అని చెప్పినట్లు ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఆ సినిమా షూటింగ్ సాఫీగా సాగలేదు. రోజు ఏదో ఒక తగువు.

ఈ అతి నమ్మకమే ఇటు తెలుగు, అటు తమిళ్లో కూడా అట్టర్ ఫ్లాప్ సినిమాగా మారింది అని మురుగదాస్ అంగీకరించాడు. కాకపోతే మహేష్ బాబు  లాంటి తెలుగు హీరోని పెట్టుకుని తమిళ్ వెర్షన్ తీయడమే తప్పని పరోక్షంగా మహేశ్ బాబును టార్గెట్ చేశాడు. ఈ అరవం వాళ్ళు ఎప్పుడు అంతే! అరవం, అరవం అంటూ ఏదో ఒకటి అరుస్తూనే ఉంటారు.

Exit mobile version