Site icon Polytricks.in

ఏటీఎంలోనే ప్రేమ జంట పాడు పనులు – దొంగలనుకొని పోలీసులు రౌండప్..!

ప్రేమికులు తమ సరసాలకు ఏటీఎంనే అడ్డాగా మార్చుకున్నారు. అర్దరాత్రి వేళ ఏటీఎంలోకి వెళ్ళి సరసాలు ఆడుతూ అందర్నీ నివ్వెరపరిచారు.

ఏటీఏంలోకి వెళ్ళిన ప్రేమ జంట ఏటీఎం డోర్ ను లాక్ చేసింది. అయితే.. ఏటీఎం అన్నాక ఎవరో ఒకరు వచ్చి వెళ్తుంటారు కదా. లోపలికి వెళ్ళిన ఆ ప్రేమ జంట ఎంతకీ బయటకు రాకపోవడంతో చోరీ చేస్తున్నారేమోనని అక్కడి డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన కొంతమంది అనుమానించారు. పైగా ఏటీఎం లాక్ కావడం వల్ల దొంగతనం కోసమే వెళ్ళారని గట్టిగా ఫిక్స్ అయ్యారు.

వెంటనే పాట్నా పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పాట్నా పోలీసుల బృందం హుటాహుటిన కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. తుపాకీలతో సహా అక్కడికి విచ్చేసిన పోలీసులు దోపిడీ దొంగలనుకొని వారిని పట్టుకునేందుకు ఏటీఎంలోకి తొంగి చూడగా…ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్లి చూడగా..ఏటీఎంలో డబ్బులను ఎవరూ తీయలేదని నిర్ధారించుకున్నారు.

చివరికీ ఆ ప్రేమ జంట ఏటీఎంలో రొమాన్స్ చేస్తూ కనిపించింది. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయిపొయింది.  పోలీసులను చూసి భయపడ్డ ఆ లవ్ బర్డ్స్ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాము దొంగతనం చేసేందుకు రాలేదని తమను విడిచి పెట్టాలని ప్రాధేయ పడటంతో  పాట్నా పోలీసులు ఆ జంటకు క్లాస్ పీకి విడిచిపెట్టారు.

ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో తాజాగా వెలుగులోకి వచ్చింది

Exit mobile version