వరంగల్ లో జరిగిన గ్లోబల్ యాక్షన్ టీం 1.5 మిలినియం కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం కు అవార్డు లభించింది. వారు చేస్తున్న సేవలకు గానూ సేవా అవార్డును అందజేశారు. సోమవారం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో లయన్స్ 320 ఎఫ్ గవర్నర్ కుందూరు వెంకట్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు చేతుల మీదుగా క్లబ్ లకి అవార్డులు అందజేసారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం ద్వారా మరెంతో సమాజ సేవ చేయాలని గట్టమనేని బాబు రావు క్లబ్ సభ్యులకి సూచించారన్నారు అధ్యక్షుడు మామిడి అశోక్. కార్యక్రమంలో పాస్ట్ మాజీ జెడ్ సి లయన్ ఉకంటి యాకూబ్ రెడ్డి, లయన్ ప్రభు కిరణ్, లయన్ సుధాకర్, లయన్ కె రమేష్, రాము గౌడ్ రమేష్, నాయుడు తదితరులు ఉన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రంకు సేవా అవార్డు
