Site icon Polytricks.in

అయినవాళ్ళు వెళ్తున్నా జగన్ ఆత్మపరిశీలన చేసుకోరా..?

టీడీపీ అధికారంలోనున్న సమయంలో చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శించిన జన విజ్ఞాన వేదిక లక్ష్మణ రెడ్డి ఇప్పుడు వైసీపీ సర్కార్ విధానాలను తప్పుబడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు జగన్ పాలనను ఖండించేందుకు ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొని జగన్ ను ఎకిపారేశారు. లక్ష్మణ రెడ్డికి మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి నెలకు రూ. నాలుగు లక్షల వరకు మూటజెప్తుంది వైసీపీ ప్రభుత్వం. తనకు వచ్చే జీతభత్యాల కన్నా రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుందని భావించి..జగన్ పై నిప్పులు చెరిగారు.

Also Read : తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు BRS & YCP పార్టీల ఆదాయం ఎంతో తెలుసా..?

అయితే, ఏపీ ప్రభుత్వంలో ఒక్క లక్ష్మణ రెడ్డి మాత్రమే అసంతృప్తిగా లేరు. చాలామందే ఉన్నారు. వారంతా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతూ మంచి జీతం వస్తోన్నా ఇవేవీ వాళ్ళను సంతృప్తి పరచడం లేదు. అందుకే జగన్ పై వాయిస్ ను మెల్లమెల్లగా రైజ్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం అంతంత మాత్రమే. ఖచ్చితంగా వస్తుందని కాని, రాదని కాని చెప్పలేని పరిస్థితి. దీంతో ప్రజల్లో విశ్వాసం కల్గి ఉండాలంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తేనే ఫ్యూచర్ ఉంటుందని అంచనాకు వస్తున్నారు.

Also Read : ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం – జగన్ మాస్టర్ ప్లాన్

ఇటీవలి కాలంగా జగన్ సర్కార్ నుంచి బయటకొస్తు.. ఏపీ సీఎం ను విమర్శిస్తోన్న వారిలో ఆయన సామజిక వర్గం వారే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారే ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ విధానాల వలన వ్యక్తిగత నష్టంతోపాటు ప్రజలకు నష్టం ఉంటుందని అంటున్నారు. ఏపీని ఉద్దరించామని ప్రచారం చేసుకుంటున్నారు కాని, ఆచరణ రూపంలో పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ జగన్ మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోకపోవడం వైసీపీకే నష్టం కల్గిస్తుందన్నది సత్యం.

Exit mobile version