Site icon Polytricks.in

సిరిసిల్లలో ఓటర్లు గుర్రు – కూకట్ పల్లి నుంచి కేటీఆర్ పోటీ..?

సిరిసిల్లలో మెజార్టీ ఓటు బ్యాంక్ ఉన్న పద్మశాలి సామజిక వర్గం బీఆర్ఎస్ పై గుర్రుగా ఉంది. పైగా..కేటీఆర్ అనుచరులు ఇసుక దందా, బెదిరింపులు, అత్యచారాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చినప్పుడల్లా ముందస్తు అరెస్టులు చేయల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా… అదంతా ఎలా జరిగిందనేది పెద్దగా చెప్పనక్కర్లేదు. దాంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేటీఆర్ ను సిరిసిల్ల నుంచి మార్చి కూకట్ పల్లి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కేసీఆర్ కు అందిన నివేదికలో ఇది స్పష్టమైంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని కొంతమంది సిట్టింగ్ లను మార్చాలని ప్రాథమిక నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. పోటీ చేసేందుకు చాలామందే ఉన్నారు కానీ బీఆర్ఎస్ అధినేతకు గెలుపు గుర్రాలు కావాలి. ఎవరిని నిలబెట్టినా ఫలితం ఉండబోదని…కేటీఆర్ ను కూకట్ పల్లి నుంచి బరిలో నిలిపితే ఎలా ఉంటుందని కేసీఆర్ పార్టీ కీలక నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.

కూకట్ పల్లి నుంచి కేటీఆర్ ను పోటీ చేయించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మిగతా నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. తద్వారా ఒకరిద్దరిని సిట్టింగ్ లను మార్చి..పాత మొహాలకు టికెట్ ఇస్తే కేటీఆర్ ప్రభంజనంలో బీఆర్ఎస్ విజయం విజయం ఈజీ అవుతుందని ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. బీఆర్ఎస్ కు అందిన స‌ర్వే ఫ‌లితాలను బట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాధవరంకు తెరాస సీటు ఇవ్వ‌డం అనుమాన‌మే అని పార్టీ వ‌ర్గాలే అంటున్నాయి. విద్యాధిక వ‌ర్గాల్లో కేటీఆర్ కు మంచి ఇమేజ్ ఉంది. సెటిలర్ల‌తో కూడా ఆయ‌న బాగానే వెలుగుతున్నారు. ఈ లెక్కన కూక‌ట్ ప‌ల్లి నుంచి ఆయ‌న్ని బ‌రిలోకి దించితే.. ఆ చుట్టుప‌క్క‌ల మ‌రికొన్ని నియోజ‌క వ‌ర్గాల‌పై కూడా కేటీఆర్ ప్ర‌భావం ఉంటుంది. ఇదే సీఎం కేసీఆర్ వ్యూహం అని చెబుతున్నారు.

ఇక.. సిరిసిల్ల నుంచి కేటీఆర్ మకాం మార్చితే ఆయన ప్లేసులో కవితకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారరట. కేసీఆర్ జాతీయ రాజకీయాల అవసరాల కోసం కవితను దేశ రాజకీయాల్లోకి వెంటబెట్టుకెల్లాలని అనుకుంటున్నారు. ఆమె మాత్రం రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఆమెను వీలును బట్టి కవితను సిరిసిల్లలో పోటీ చేయించడంపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version