Site icon Polytricks.in

డ్రగ్స్ టెస్టుకు ఏడాది తరువాత కేటీఆర్ రెడీ – ఏంటి మేటర్..?

తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను టెస్టులకు సిద్దమని స్పష్టం చేశారు. నా బొచ్చు కావాలంటే బొచ్చు ఇస్తా, గోర్లు కావాలంటే గోర్లు ఇస్తా, రక్తంతోపాటు కిడ్నీ కూడా ఇస్తానని ఏ టెస్టులు చేయిస్తావో చేయించు అంటూ సవాల్ చేశారు. డ్రగ్స్ టెస్టులో తనకు క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ కమాన్ దగ్గర బండి సంజయ్ తన చెప్పుతో తనే కొట్టుకుంటాడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇటీవల బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతలతోపాటు కేటీఆర్ ఆరోపణలు చేశారు. బండి సంజయ్ తంబాకు తింటాడని వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు డ్రగ్స్ ఆరోపణలు చేశారు బండి సంజయ్. కేటీఆర్ రెండు వెంట్రుకలు ఇస్తే ఆయన డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. దీనిపై తాజాగా స్పందించిన కేటీఆర్ నేను రెడీ అంటునే ప్రతి సవాల్ విసిరారు.

Also Read : రేవంత్ ను ఫాలో అవుతోన్న బండి సంజయ్

గతంలో కేటీఆర్ కు ఇదే తరహ సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. వైట్ చాలెంజ్ పేరుతో టెస్టులకు రావాలన్నారు. కేటీఆర్ తోపాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ లకు వైట్ చాలెంజ్ చేశారు. ఇందుకు కొండా , బండి సంజయ్ లు రెడీ అన్నారు. కాని కేటీఆర్ మాత్రం తోక ముడిచారు.

వైట్ చాలెంజ్ కు రాకుండా ట్విట్టర్ లో ఏవేవో విమర్శలు చేసి, పరువు తీసుకున్నారు. అయినా, రేవంత్ వదలకపోవడంతో విధిలేని పరిస్థుతులలో తనపై డ్రగ్స్ ఆరోపణలు చేయకుండా నిరోధించాలని కోర్టుకు వెళ్లి కేటీఆర్ స్టే తెచ్చుకున్నాడు.

తాజాగా బండి సంజయ్ డ్రగ్స్ కేసుల గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ కు సవాల్ చేశారు. డ్రగ్స్ విషయంలో గతంలో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే పారిపోయిన కేటీఆర్ , ఏడాది తరువాత బండి సంజయ్ సవాల్ విసరగానే గెట్ రెడీ అంటూ ప్రతిస్పందించడం పలు అనుమానాలు లేవనెత్తుతోంది. డ్రగ్స్ ఆనవాళ్ళు బాడీలో లేవని నిర్ధారించుకొని టెస్టులకు కేటీఆర్ రెడీ అంటూ ప్రకటించారని చెబుతున్నారు.

Exit mobile version