టీకప్పులో తుపాన్ ముగిసింది. కాంగ్రెస్ కుటుంబమంతా ఒకటే అని మరోసారి రుజువైంది. తెలంగాణ మంత్రివర్గంలో ఏదో జరిగిపోతుందని చిలువలు పలువలు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటూ నాయకులకు రాత్రంతా నిద్ర పట్టలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం కొండాసురేఖ ఇచ్చిన క్లారిటీతో సమస్య సమసిపోయింది. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె క్లారిటీ ఇవ్వడంతో అక్కడితో పుల్‌స్టాప్ పడింది. తమది ఒక కుటుంబం అని..ఇందులో చిన్న చిన్న బేధాభిప్రాయాలు సహజమే అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ముఖ్యమంత్రిపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వం…ఇక్కడ మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. పార్టీ విధివిధానాలు, ప్రభుత్వ పనితీరుపై ఓపెన్ గా మాట్లాడే ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎక్కడా వెనుకాడదు ప్రజా సర్కార్. విమర్శలను కూడా చాలా హుందాగా స్వీకరిస్తుంది. అయితే ఇదంతా ముగిసిన ఎపిసోడ్. మరి బీఆర్ఎస్‌లో జరిగిన పంచాయతీపై ఏనాడైనా ఇంత ఓపెన్‌గా కార్యకర్తలు, నాయకులు మాట్లాడారా? ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్, హరీష్ రావు కనీసం ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రజా సర్కారుకు..నియంతృత్వ ప్రభుత్వానికి తేడా ఇక్కడే అర్ధమవుతుంది. ముందు మీ ఇళ్లు చక్కబెట్టుకోండి. ఆ తర్వాత ఎదుటివారిపై ఏడ్వొచ్చు.