Site icon Polytricks.in

ఇంకా ముదిరిన ‘కెజిఎఫ్’ కాంట్రవర్సి?

కన్నడ సినిమా రంగంలో గొప్ప దర్శకుడిగా పేరున్న వెంకటేష్ మహా  ‘కెజిఎఫ్’ సినిమా చెత్త సినిమా అని, ఆ సినిమా దర్శకుడికి  కామన్సెన్స్ లేని ఇడియట్ అని మొన్న బండబూతులు తిట్టాడు. ఆ సినిమా కథ, నటీనట్లు, దర్శకుడు కలిసి ఓ వర్గం వాళ్ళ మనోభావాలను కించపరిచారు అని అసభ్యకరమైన పదజాలంతో తిట్టని తిట్టు తిట్టాడు.

ఆ బూతులు ప్రచారం చేయడానికి చాలా ఛానళ్ళు ఇబ్బంది పది బీప్ సౌడ్తో ప్రచారం చేయాల్సి వచ్చింది. ముక్యంగా ఆ సినిమా దర్శకుడు ప్రశాత్ నీల్ ని దారుణంగా తిట్టాడు. ఆ సినిమా హీరో ‘యాష్’ని తిట్టకపోయినా ‘రాఖి భాయి’ లాంటి చెత్త పాత్రను ఎవడో సృస్తిసే, దానికి యాష్ నటించడం తప్పని ఇంకా దారుణంగా తిట్టాడు. వాటిని తెలుగులో ‘పరమ బూతులు’ అంటారు.

ఆ తిట్లు దేశవ్యాపంగా సంచలనం రేపాయి. హీరో ‘యాష్’, దర్శకుడు ప్రశాత్ నీల్ అభిమానులు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చారు. వెంకటేష్ మహాను కొట్టడానికి దాడులు చేశారు. అతను ఎక్కడ దాకున్నా చంపుతామని తరిమారు. వాళ్ళు కూడా పరమ బూతులు తిడురు మీడియాకు ఎక్కారు. ఆ గొడవ చివరికి కన్నడ పరిశ్రమ పెద్దల వరకు వెళ్ళింది.

వెంకటేష్ మహాను కన్నడ పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అనే డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. దాంతో పెద్దలు వెంకటేష్ మహాకి ఫోన్ చేసి చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పెకపోతే వేటు పడుతుంది అని హెచ్చరించారు. దానికితోడు వెంకటేష్ మహా  బయట తిరగడం కూడా కష్టంగా మారింది.  అందుకే ‘తగ్తగేదే లే’ అనుకున్న వాడు కాస్త ‘తగ్గాడు’.

అందుకే వెంకటేష్ మహా ఈ రోజు మీడియా సోషల్ మీడియాలో పెట్టి  అందరికి క్షమాపణలు చెప్పాడు. అయితే తాను అలా బూతులు మాట్లాడం తప్పని ఒప్పుకున్నారు. పొతే తాను లేవనెత్తిన పాయింట్ మాత్రం తప్పు కాదని మళ్ళి తనను తాను సమర్థించుకున్నాడు. తాను సినిమాను తప్పుపట్టడం లేడని, ఆ సినిమాలో ఉన్న కథను తప్పు పట్టడం లేదని వివరణ ఇచ్చారు.

తాను చెప్పింది ఓ వర్గం వ్యక్తుల అభిప్రాయం మాత్రమేనని వివరించారు. ఆ సినిమా చూసి బాధపడిన వాళ్లు తనతో ఆ బాధను చెప్పుకున్నారు, వాళ్ళ మనో భావాలను నేను ప్రపంచానికి చెప్పను అన్నారు. తన అభ్యంతరం కేవలం  కల్పితంగా రాసిన ‘రాఖి భాయి’ పాత్ర గురించేనని అన్నారు. అంతేకానీ దర్శకుడు, హీరో టాలెంట్ ని కించపరచాలని కాదు అన్నాడు. ఆ అభిప్రాయాలను తాను అలా బూతులతో చెప్పడం వల్ల కాంట్రవర్సి అయ్యింది అని బాధపడ్డారు. దానికి సారి చెపుతున్నారు.

కానీ తన అభిప్రాయాలను మార్చుకున్నట్లు ఎక్కడా అతను వివరణ ఇవ్వలేదు. దానితో పరిస్టితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీనిఫై కోర్టుకు వెళ్లే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది.

Exit mobile version