Site icon Polytricks.in

దేవినేని ఉమకు చెక్ పెట్టేందుకు కేశినేని నాని ప్రయత్నాలు

వసంత కృష్ణా ప్రసాద్ వైసీపీని వీడే యోచనలో ఉన్నారని..టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. మైలవరం నియోజకవర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ చేరికపై అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దేవినేని ఉమను  కాదని కృష్ణప్రసాద్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున సీట్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన తండ్రి కేశినేని నాని ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వర్ రావు కేశినేని నానిని ప్రత్యేకంగా కలిశారు. ఆ తరువాత కేశినేని నాని మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో ఎవరు..? ఎక్కడ పోటీ చేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని కేశినేని నాని ప్రకటించడం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే.. దేవినేని ఉండగా చంద్రబాబు మరొకరికి మైలవరం టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ కేశినేని నాని ఈ కామెంట్స్ చేశారు.

దేవినేని ఉమాకు కేశినేని నానికి అస్సలు పడదు. టీడీపీలో అందరికీ ఈ విషయం తెలుసు. దేవినేని ఉమా కారణంగానే కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీని వీడారని అంటుంటారు. వీరిద్దరూ ఆయనను తట్టుకోలేక పార్టీని వీడారని అంటున్నా..కేశినేని నాని మాత్రం పార్టీలోనే ఉంటూ దేవినేనిపై అప్పట్లో ఘాటుగానే విమర్శలు చేసేవారు. ఆ తరువాత ఉమా తన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఇతర నియోజకవర్గాల్లో తలదూర్చడం లేదు. ఇప్పుడు మైలవరంలోనే కేశినేని నాని ఆయనకు వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీలో చేర్చే బాధ్యతను కేశినేని తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కృష్ణా జిల్లాలో దేవినేని నానికే చంద్రబాబు ఎక్కువ ప్రియార్టి ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయనను కాదని వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ పై హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటారా అన్నది అనుమానమే. కాకపోతే.. సీట్ల సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

Also Read : ఏపీ మంత్రి కొత్త దందా – కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Exit mobile version