Site icon Polytricks.in

మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్..?

వీఆర్వో, వీఆర్ఏ వ్య‌వ‌స్థ‌ల‌ను ర‌ద్దు చేసిన సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? రెవెన్యూ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు రావాలని అభిప్రాయపడుతోన్న కేసీఆర్ ఆర్డీవో వ్యవస్థను రద్దు చేయబోతున్నారా..? అంటే అవుననే టాక్ నడుస్తోంది.

ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఆర్డీవోల ప్రాధాన్యత తగ్గింది. ఆ తరువాత వీఆర్వో , వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ఆర్డీవో అధికారాలను మరింత కుదించింది. ఇప్పుడు ఏకంగా ఆర్డీవో వ్యవస్థనే రద్దు చేయాలని కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్డీవో వ్యవస్థను రద్దు చేస్తే ఆ శాఖ అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు..? వారి సేవలు ఎలా ఉపయోగించుకుంటారు..? అనేది ఉన్నాతాదికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు ఆర్డీవో వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి.

తెలంగాణలోని ఏరియా ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ లు ఉన్నారు. ఇకపై వీళ్ళను పర్యవేక్షించే బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగిస్తామని హరీష్ చెప్పడం ప్రాధాన్యత చర్చనీయాంశం అవుతోంది. ఆసుపత్రులకు అఫీసర్లుగా బాధ్యతలు అప్పగించే కంటే ఆర్డీవో వ్యవస్థనే రద్దు చేసే అవకాశం ఉందనే స్పెక్యూలేషన్స్ వస్తున్నాయి.

Exit mobile version