ఏం జరిగిందని కేసీఆర్ తెలంగాణకు ” మరణశాసనం ” లిఖించారు ?

పార్టీలో సంక్షోభం లేదు ,
ఎవరూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదు ,
ప్రజల్లో విపరీతమైన పలుకుబడి ఉందని TRS నేతలు పదేపదే చెప్తూనేవున్నారు ,
దేశంలో ఆర్ధికంగా అగ్రస్థానం లో ఉన్నామని , ఎవరూ ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు పెట్టామని
అన్ని రాష్ట్రాలు తెలంగాణాను ఆదర్శంగా తీసుకుంటున్నారని గర్వంగా ప్రకటిస్తున్నారు ,
కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించామని , లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ,
మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు కేసీఆర్ చెప్పాలి .
ఈ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లటం కాదా ?

TRS Party
ఇప్పటికే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోనికి నెట్టివేసినందుకా ?
2014 లో తెలంగాణా అమరుల ఆశలు నెరవేరుస్తారనే విశ్వాసం తో వోట్లు వేసి గెలిపించి
63 స్థానాలు మీకు అందిస్తే ,
మళ్ళీ ఎన్నికలకు పోయి రాష్ట్రాన్ని ఇంకా అప్పులఊబి లోనికి దించటానికే ఈ నిర్ణయమా ?
ఒకవేళ మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే ,
మళ్ళీ ఎవరో సిద్ధాంతి చెప్పాడనో , అయ్యగారు మంచి జాతకం చెప్పాడనో , మీకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు పోరని నమ్మకం ఏమిటి ?
5 యేండ్లు మంచిగా పాలించమని , అమరుల ఆకాంక్షలు నెరవేర్చమని అధికారం అందిస్తే ఇదెక్కడి
” నపుంసక ” రాజకీయం మీరు చేస్తున్నారు ?
సభలు , విలాసవంతమైన , వైభోగపూరిత జీవితాన్ని అనుభవించటానికి , అప్రజాస్వామిక విధానాలతో హక్కుల్ని లేకుండా చెయ్యటానికి , పోలీసులతో , భక్తుల భజనలతో కాలక్షేపం చెయ్యటానికి మీకు అధికారం అందివ్వలేదు .
తెలంగాణ ద్రోహులతో , దోచుకున్నవారితో , కలసి పనిచేస్తూ ,
ఉద్యమకారుల ఆశయాలను తుంగలోతొక్కే అర్హత మీకు ఉందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *