కేసీఆర్ స‌ర్కార్ కు నిరుద్యోగ యువ‌త ఘాటు లేఖ‌…. డిగ్రీలు చేసినా, బిచ్చ‌గాళ్ల బ‌తుకు చేశారంటూ ఆగ్రహాం.

అమ్మానాన్న‌లు రాత్ర‌న‌క‌, ప‌గ‌ల‌న‌క పోలంలో క‌ష్ట‌ప‌డుతూ… నా కోడుకు, బిడ్డ ఏ క‌ష్టం రాకుండా బ్ర‌త‌కాలంటూ మ‌మ్మ‌ల్ని ప‌ట్నం పంపి చ‌దివించారు. నెల‌, నెలా డ‌బ్బులు పంపారు. వాళ్ల‌కు ఇంట్లో తిండికి లేకున్నా, నాకు ఏ క‌ష్టం రానివ్వ లేదు. మీరు క‌దా… కేటీఆర్ ను స‌దివించిన‌ట్లే. కాక‌పోతే… మీవి ఉన్న బ‌తుకులు అంతే. కానీ తల్లితండ్రుల ప్రేమ మాత్రం అదే. అలా డిగ్రీ చ‌ద‌వినం, కానీ ఉద్యోగం వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని ఇంకో డిగ్రీ. త‌ర్వాత పీజీ అట్లా… పీ.హెచ్.డీలు స‌దివిన వారు కూడా ఉన్నారు. యూనివ‌ర్శిటీల్లో ఉన్న‌ది తిని, లేన్నాడు ప‌స్తులున్నం. మీరు సౌక‌ర్యాలు క‌ల్పించ‌కున్నా స‌ర్ధుకున్నాం, తెలంగాణ కోసం మీవెన‌క‌, మీ మాట ప్ర‌కారం కొట్లాడినం. తెలంగాణ వ‌స్తే… ఉద్యోగాలు వ‌స్త‌యి, మా అమ్మానాన్న‌ల‌ను ఇక‌నైనా సుఖ‌పెడుదామ‌నుకున్నాం… కానీ ఇంకా సదువు పూర్త‌యినంక కూడా వారిచ్చే నెల‌నెలా డ‌బ్బులకు ఎదురుచూస్తు బ‌రించ‌లేక‌పోతున్నాం.

Telangana unemployment youth

మాకు ఉద్యోగాలు కావాలంటూ… కోరితే, బిచ్చ‌మెసిన‌ట్లు భృతి అంటావెంది… ఇట్లా ఓ నిరుద్యోగి త‌న ఆవేద‌న‌ను వెల్ల‌క‌క్కుతూ సీఎం కేసీఆర్ కు రాసిన ఉత్త‌రం సంచ‌ల‌నంగా మారింది. ఆ ఉత్త‌రం యాధావిధిగా మీకోసం….

మేము అడిగామ నిరుద్యోగ భృతి ఇవ్వమని నిరుద్యోగులు బిచ్చగాళ్ల ఎవనికి కావాలె మీ మూడు వేల పదహార్లు గౌరవంగా బతికే అవకాశం కల్పించమంటే ఇంత దుర్మార్గమా

తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని మీరు ఒక్క ప్రకటన చేస్తే యావత్ తెలంగాణ యువత లాఠీ దెబ్బలు తిన్న వందల కేసులైన చివరికి ఆంధ్ర ప్రజలతో అమ్మను అక్కను తిట్టించుకుంటు ఎన్ని అవమానాలు ఎదురైన బెదరకుండా ఉద్యమాలు చేస్తూ నిలబడింది మీరిచ్చే మూడు వేల పదహార్ల కోసమా

ఇంటింటికి ఉద్యోగం అని మీరు ప్రకటనలు చేస్తేనే కదా మేము ఉద్యమంలోకి దిగింది మన ఉద్యోగాలు మనకు అంటేనే కదా లాఠీ దెబ్బలు తిన్నది ఇంటింటికి ఉద్యోగం ఇవ్వండ అని కూడా మేము అడగలేదు కదా అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించిన లక్ష 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయమనే కదా మేము అడిగింది

ఐదేళ్లు ఉద్యమాలతో మా బ్రతుకులు సంపాదన లేకుండా గడిచింది తెలంగాణ వచ్చాక అయిన మా బ్రతుకులు మారుతాయని అనుకున్నాం ఎం చేశారు మీరు నోటిఫికేషన్లు సరైన టైం కి ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్లు ముక్కోటి తప్పులతో ఇచ్చి మా బ్రతుకులు ఎటు కాకుండా చేశారు ఒకవైపు అప్పులు మరో వైపు ఎక్కడరా ని ఉద్యోగం అని ఎత్తి పొడుపులు

ఉద్యోగాలు ఇప్పుడే ఇవ్వం అని 2014 లొనే చెప్పి ఉంటే ఎవని పనులు వాడు చూసుకునే వాళ్ళం కదా ఎందుకు వారానికి ఒకసారి త్వరలో ఉద్యోగాల భర్తీ త్వరలో ఉద్యోగాల భర్తీ అని ఆశలు కల్పించారు

ఈ నాలుగున్నారేళ్లలో మీరిచ్చిన నోటిఫికేషన్ల లో ఒక్క గురుకుల పోలీసు ఉద్యోగులా రిషల్ట్స్ తప్ప అదనంగా ఏమిచ్చారు గా పరీక్ష కీ ల కోసం కూడ నెలల తరబడి ఎదురు చూడాలా ఏం ప్రశ్న పాత్రలు తయారు చేసినోడు కీ లు తయారు చేయడా మీరు కీ లు ఇస్తే అయిన ఉద్యోగం వస్తాదా రాదా అని అంచనా వేసుకుని ఎవని పని వాడు చూసుకుంటాడు కదా ఈ తొమ్మిదేళ్లు మేము కోల్పోయిన పని దినాలకు మీరిచ్చే సమాధానం ఏంటి

నోటిఫికేషన్లు ఇవ్వరు కీ లు ఇవ్వరు రిషల్ట్ లు ఇవ్వరు టీఎస్పిఎస్సి లో ఉద్యోగులను నియమించరు

ఎటు చేసి నిరుద్యోగులను నిరుద్యోగులుగానే ఉంచాలనే మీ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతి రూపమే ఈ నిరుద్యోగ భృతి యావత్ తెలంగాణ యువత దీనికి సమాధానం చెప్పి తీరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *