KCR ఫామ్ హౌస్ పక్కన ఎర్రవల్లి లో గులాబీ గుండా గిరి పెద్ద సారుకు తెలువదా…..?

సామాన్య ప్రజలకు ఒక రకపు ఇల్లు,కేసీఆర్ అనుచరులకు మరొక రకపు ఇల్లు.ఇది ఎక్కడో కాదు,వందల కోట్లు పెట్టి స్వలాభం కోసం ఎంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం అయిన ఎర్రవల్లిలో.

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకుని ఊర్లో ప్రతి ఒక్కరికి 200 గజాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇస్తాను అని చెప్పడంతో గ్రామస్తులు తమకున్న ఇండ్లు కూలగొట్టుకుని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మారు.ఊర్లో మొత్తం 420కు పైగా ఇండ్లను నిర్మించి ఇచ్చారు.

 

కేసీఆర్ గ్రామానికి వచ్చినప్పుడల్ల కిష్టారెడ్డి అనే గ్రామస్తున్ని కలుస్తుండే వాడు.అతని ఇంటికి వెళ్ళేవాడు.ఇతడు మాజీ సర్పంచ్(టీడీపీ).కిష్టారెడ్డి తన గారడీ మాటలతో కేసీఆర్ ను సైతం వలలో వేసుకుని ఊరికి మొత్తం నేనే పెద్ద మనిషి అయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఏ అడ్డంకి రాకుండా చూస్తానని కేసీఆర్ కి మాట ఇచ్చి తన అసలైన మార్క్ ను ఎర్రవల్లి ప్రజలకు చూపించాడు.ఎర్రవల్లి లో ఇండ్లు కట్టించడానికి ముందుకు వచ్చిన మీనాక్షి కంస్ట్రక్షన్ అధికారులతో కుమ్మక్కై భారీ భవనాన్ని కట్టించుకున్నాడు.ఎర్రవల్లిలో ప్రతి ఒక్కరు ఇల్లు కూలగొట్టుకోగా కిష్టా రెడ్డి మాత్రం తన ఇంటిని అలాగే ఉంచుకొని సుమారు వెయ్యి గజాలలో మరొక భారీ డబుల్ బెడ్ రూమ్ భవనముతో పాటు ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ని నిర్మించుకొన్నాడు.
ఎర్రవల్లి లో చాలా మందికి 400 నుండి 500 గజాలలో అంతకంటే ఎక్కువే ఉన్నటు వంటి సామాన్యుల ఇండ్లని కూల్చివేసి,200 గజాలలో మాత్రమే ఇండ్లను కట్టించాడు.కిష్టా రెడ్డికి మాత్రం సుమారు 1000 గజాల్లో భారీ భవనం నిర్మించి ఇవ్వడం ఏంటి ఇది న్యాయమేనా.సామాన్యులకో న్యాయం,కేసీఆర్ తో తిరిగే వారికో న్యాయమా.ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం ఏంటి.
ఎర్రవల్లి లో VDC కమీటి పెట్టి దానికి చైర్మన్ గా కిష్టా రెడ్డి వ్యవహరిస్తున్నాడు.చైర్మన్ అయిన అయిదు రోజులలో గ్రామస్తులందరూ కలిసి కిష్టా రెడ్డి గత చరిత్ర తెలిసి ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకించి చైర్మన్ గా దిగిపోవాలాల్సింది గా అందరు ఆయనకీ వ్యతిరేకంగా తిరగబడడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి గ్రామస్తులను వారించాడు.కిష్టా రెడ్డి ఎన్నిక కేసీఆర్ కి తెలిసింది కావున ఇపుడు ఐదు రోజుల్లో ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతారు.దానికి మనం సమాధానం చెప్పలేం అని కిష్టా రెడ్డి ని కలెక్టర్ స్వయంగా వెనుకేసుకొచ్చాడు.కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని కేసీఆర్ ఎర్రవల్లికి స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది.

కిష్టా రెడ్డి సర్పంచ్ గా ఉన్నపుడే అవినీతికి పాల్పడడంతో అతని చెక్ పవర్ రద్దు అయింది.కిష్టా రెడ్డి చరిత్ర కేసీఆర్ కి తెలియదా.కేసీఆర్ ఎందుకు కిష్టారెడ్డిని నమ్మాడు.ఎర్రవల్లి లో దాదాపుగా ఏ ఇంటి తలుపు తట్టిన కిష్టా రెడ్డి బాధితులే కనపడతారు.కిష్టా రెడ్డి
గ్రామస్తులను ఏ విదంగా ఎర్రి పుష్పాలను చేస్తున్నాడో తెలిస్తే అందరు నోరెళ్లబెట్టాల్సిందే.

**ముఖ్యమంత్రి కేసీఆర్,కిష్టా రెడ్డి ఒక సమయంలో టిఫిన్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి అయిన ఐఏఎస్ నర్సింగ రావు వచ్చాడంట ఆ సమయంలో కేసీఆర్ కిష్టా రెడ్డిని, కిష్టన్న రెండు ఇడ్లిలు పెట్టుకో పల్లిల తొక్కు నీకోసమే చేపించిన మంచిగా ఉంటది తిను అన్నాడంట.నర్సింగ రావు షాక్ అయి తరువాత కిష్టా రెడ్డి కి ఫోన్ చేసాడంట.హరీష్ రావుతో కూడా కేసీఆర్ ఎప్పుడు తినలేదు అలాంటిది నీతో తిన్నాడు,నువ్వు చాలా గ్రేట్ అని అన్నాడంట.
**ఇంకొక సందర్భంలో కేసీఆర్ ప్రతి రోజు రాత్రి 10గంటలకు ఫోన్ చేసి ఒక గంటసేపు మాట్లాడి తెలంగాణలో మొత్తం ఎలా ఉంది,ఎం జరుగుతుంది.2019 లో నువ్వే నా రాజకీయ కార్యదర్శివి.తెలంగాణను మొత్తం నువ్వే చూసుకోవాలి అని అంటాడంట.

**మరికొన్ని రోజులలో యాదాద్రి టెంపుల్ కి ఈఓ నేనే అవుతా,కేసీఆర్ నాకు మాట ఇచ్చిండు. నాకు ఒక బుగ్గ కారు,ఇద్దరు గన్ మెన్ లు వుంటారు.టెంపుల్ మొత్తం నాకే అప్పగిస్తా అని అన్నాడంట.
**ఎవడు రమ్మన్నాడు ఎర్రవల్లికి ఎవడు ఇండ్లు కట్టియమన్నాడు ఇండ్లు అని కేసీఆర్ ను సైతం పలు సందర్భాల్లో ఆయనపై రివర్స్ డైలాగ్స్ వేసేవాడు.
**కేటీఆర్ తో ఎర్రవల్లి యువకులకు మొత్తం జాబ్ లు ఇప్పిస్తా.ఫైనల్ సంతకం ఒకటే ఉంది.వారం,పది రోజుల్లో మొత్తం ఊర్లో ఉన్నవాళ్లందరికి ఉద్యోగాలు వస్తాయి అని గత సంవత్సర కాలంగా చెపుతున్నాడు.
ఇంకా ఇవే కావు కిష్టారెడ్డి మాటలకు ఎవరైనా పడిపోవాల్సిందే.కేసీఆర్ నేను ఎం చెప్తే అది చేస్తాడు.కలెక్టర్ తో పాటు మిగతా అందరు అధికారులు నా ఇంటికి వచ్చి మరి నన్ను బతిమిలాడుతారు.ఏ పని కావాల్సిన నేనే వారికి దిక్కు అని విర్రవీగుతాడు.

కిష్టా రెడ్డి,కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని డబుల్ బెడ్ రూమ్ ల కోసం జరిగిన పంచాయతీల్లో చిన్నా,పెద్దా,మహిళా అని తేడా లేకుండా వారిని తీవ్రమైన పదజాలంతో,రాయలేని విధంగా బూతులు తిడుతుంటే గ్రామ యువతతో పాటు ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోవడం దారుణం.ముందుకు రాకపోవడానికి కూడా ఒక కారణం ఉంది,నాకు జిల్లా మొత్తం పోలీసులు తెలుసునని నన్ను ఎవరు ఎం పీకరని పలు సందర్భాల్లో గ్రామస్తులను హెచ్చరించేవాడు.
కేసీఆర్ ఎర్రవల్లిలో పలు సందర్భాల్లో మహిళలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి,వారి పట్ల విధేయతతో ఉండాలి అని చెప్పాడు.కాని కిష్టా రెడ్డి మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను తీవ్రమైన పదజాలంతో బూతులు తిట్టేవాడు.మహిళా మనులను తిడుతున్నా గ్రామస్తులు,గ్రామ యువకులు మాత్రం ముందుకు రాకపోవడం షోచనీయం.
సీఎం దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.రాజకీయ నాయకుల అండదండలతో సామాన్య జనాలను పీల్చుకుతింటున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఇకనైనా ఉంది.తెలంగాణలో ఇంకెన్ని ఇండ్లు ఇలా మీ పేర్లు చెప్పుకుంటూ కట్టుకుంటున్నారో,ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *