Site icon Polytricks.in

మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకున్న తండ్రి, కొడుకులు..!!?

తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని రూపొందిస్తున్నారా..? 2018ముందస్తు ఎన్నికల సమయంలో చంద్రబాబును బూచిగా చూపి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే అస్త్రాన్ని ఎంచుకున్నారా..? అంటే అవుననే తెలుస్తోంది.

తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ , కేటీఆర్ అండ్ హరీష్ రావులు కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ 24గంటల విద్యుత్ కు అడ్డంకి అని, చెక్ డ్యాంల నిర్మాణాలకు వ్యతిరేకమని, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనీ అనుకోలేదని చెప్పేందుకు ముగ్గురు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే.. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పెరిగింది. ఇదే ఊపు కాంగ్రెస్ లో ఉంటే తమ అధికారానికి ఎసరు వస్తుందని భావించిన ప్రభుత్వ పెద్దలు రివర్స్ ఎటాకింగ్ స్టార్ట్ చేశారు.

కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలకు శత్రువులా చూపేలా పదునైన వాగ్భాణాలను సంధించారు. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా చివ‌రి రోజు కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నమ‌ని అంటున్నారు. కాంగ్రెస్సే తెలంగాణాకు మొదటి శత్రువు అని ప్రసంగించారు కేసీఆర్. కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ నష్టపోయిందని వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్ర ప్రజల్లో హేయభావాన్ని కల్పించి లబ్ది పొందెలా వ్యవహరించారు.

తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ మనషులు. అందుకే మరోసారి ప్రజల్లో భావోద్వేగాలను సృష్టించేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Also Read : ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూసిన గద్దర్

Exit mobile version