Site icon Polytricks.in

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం – లిక్కర్ స్కామ్ కేసు సంగతేంటి..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాలు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాలపాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు కవిత పేర్కొన్నారు.

కవిత కాలుకు గాయం కావడంతో ఆమె ఇప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరయ్యే అవకాశం లేదు. ఇటీవల ఈడీ విచారణకు హాజరైన కవిత ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటాను వెలికి తీసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కవిత నుంచి పది ఫోన్లను తీసుకున్న ఈడీ అధికారులు ఫోన్లలోని సమాచారాన్ని వెలికితీసిన అనంతరం విశ్లేషణ చేసి కవితను మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది.

కవిత ఫోన్లలోని డేటా రికవరీ చేయడం పూర్తైందని త్వరలోనే ఈడీ నుంచి కవితకు పిలుపు వస్తుందని విస్తృత ప్రచారం జరుగుతోన్న వేళ ఆమె కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇప్పట్లో ఈడీ విచారణకు పిలిచినా ఆమె వెళ్ళే అవకాశం లేదు. కాలుకు గాయమవ్వడంతో మూడు వారాలపాటు ఆమె ఎలాంటి విచారణకు హాజరు కారు. విచారణ అత్యవసరమనుకుంటే ఈడీ అధికారులే కవిత ఇంటికి వెళ్లి ప్రశ్నించే అవకాశం ఉంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని కవిత ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని కోరుతూ ఆమె తరుఫు న్యాయవాదులు ప్రధానంగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే కవితను ఆమె నివాసంలోనే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సగం టెన్షన్ తప్పినట్లే.

గమ్మత్తు విషయం ఏంటంటే… ఆ మధ్య కేటీఆర్ కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. ఆయనకు కూడా మూడు వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు ఇప్పుడు కవిత కాలు ఫ్రాక్చర్ కాగా ఆమెకు కూడా మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని చెప్పడం గమనార్హం.

Also Read : కవిత కోసం బండిపై కేసీఆర్ మెతక వైఖరి..?

Exit mobile version