Site icon Polytricks.in

లిక్కర్ స్కామ్ లో నాలుగోసారి విచారణకు కవిత – జరిగేది ఇదేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మరోసారిఈడీ విచారణకు పిలవనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే మూడుసార్లు కవితను విచారించిన ఈడీ నాలుగోసారి విచారణకు పిలిచి కీలక అంశాలపై సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను నాలుగోసారి విచారణలో ప్రధానంగా ప్రశ్నించి..ఆమె ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈడీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం .

ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు హాజరైన కవిత…ఈ విచారణలో ఆమె ఎదుర్కొన్న ప్రశ్నల క్రమాన్ని పరిశీలిస్తే అసలు విషయం యిట్టె అర్థం అవుతోంది. అయితే… ఇప్పటివరకు ఆమెకు ఎదురైనా ప్రశ్నల ఆధారంగా నాలుగోసారి కవిత ముందు ఎలాంటి ప్రశ్నలను ఉంచే అవకాశం ఉందనే విషయంలో కొంత క్లారిటీ వస్తోంది.

మొదటిసారి విచారణలో కవిత ఎదుర్కొన్న ప్రశ్నలివే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీ ప్రమేయం ఏమిటి..?

లిక్కర్ పాలసీ రూపకల్పనలో మీరెందుకు జోక్యం చేసుకున్నారు,..?

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక ప్లైట్ ను ఎవరు ఏర్పాటు చేశారు..?

మీ కోసం ప్లైట్ ను ఎందుకు ఏర్పాటు చేశారు..?

ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారు?

కోట్లాది రూపాయలు ఎలా అందాయి..?

కోట్లాది రూపాయలను ఎవరు ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..?

రెండోసారి విచారణలో ఎదుర్కొన్న కీలక ప్రశ్నలు

రామచంద్ర అరుణ్ రామచంద్ర పిళ్లై ఎవరు..?

గోరంట్ల బుచ్చిబాబు ఎవరు..?అతనితో మీకు ఎలా పరిచయం?

ఇద్దరితో మీకున్న సంబంధాలు ఏమిటి..?

ఈ ఇద్దరికీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి ప్రమేయం ఉంది..?

మనీష్ సిసోడియాతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?

మూడోసారి ఎదుర్కొన్న కీలక ప్రశ్నలు?

స్వల్ప కాలంలో పది ఫోన్లను ఎందుకు మార్చారు..?

ఫోన్లను మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

సిమ్ కార్డులను ఎందుకు మార్చారు..?

మీ పేరుపైనే ఈ ఫోన్లను కొనుగోలు చేశారా..?

ఇలా మూడోసారి విచారణలో ప్రశ్నలన్నీ ఫోన్ల చుట్టే తిరిగినట్లు తెలిసింది. ఈసందర్భంగా ఆమె చెప్పిన సమాధానాలు రికార్డ్ చేసుకొని వాటిని ఈడీ వద్ద ఉన్న ఆధారాలతో క్రాస్ చెకింగ్ జరుగుతుంది. ఈడీ అధికారులు అడిగిన ఫోన్లను ప్యాక్ చేసి సీల్డ్ కవర్ లో అందజేశారు కవిత.

మూడుసార్లు విచారణకు పిలిచిన కవితను నాలుగోసారి విచారణకు పిలవడం ఖాయమని అంటున్నారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ తరువాత ఆమెను ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ సారి ఆమెను ఎలాంటి ప్రశ్నలను అడుగుతారానే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం చూస్తె నాలుగోసారి విచారణలో ఆమెను ఈ విధంగా విచారణ జరపనున్నారని అంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పిళ్లై, బుచ్చిబాబులను ఎదురుగా కూర్చోబెట్టి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వారి విచారణ పూర్తి అయిన నేపథ్యంలో.. విచారణ వేళ వారు అందించిన సమాచారాన్నికవిత వ్యాఖ్యలతో క్రాస్ చెక్ చేయనున్నారు.

Exit mobile version