Site icon Polytricks.in

చెప్పుతో కొడుతా – ఎంపీ అరవింద్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని, వెంటాడి వేటాడి పట్టుకు తంతానని హెచ్చరించారు. కేసీఆర్ తోపాటు తనను అరవింద్ అనరాని మాటలు అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలవడం ప్రజల కర్మ అన్నారు.

ఎంపీ అరవింద్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

అరవింద్ పై కవిత తీవ్రస్థాయిలో రెచ్చిపోయెందుకు కారణం ఉంది. బుధవారం మీడియాతో అరవింద్ మాట్లాడుతూ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట బీజేపీలో చేరేందుకు కవిత ప్రయత్నించిందని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారని.. ఆ పార్టీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సంప్రదింపులు కూడా షురూ చేశారన్న అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కవిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

కొత్త సచివాలయం… కొత్త సీఎం – ఐడియా అదిరిందయ్యా చంద్రం..!

తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతానని అరవింద్ ను కవిత హెచ్చరించారు. పట్టుకు తంతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, కవితపై అరవింద్ ఆరోపణలను ఖండిస్తూ.. టీఆర్ఎస్ నేతలు, జాగృతి నేతలు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనిలోని అరవింద్ ఇంటిని ముట్టడించారు. ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్ళి ఇంటి అద్దాలను , కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

మరి, చెప్పుతో కొడుతానని తననుద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలకు అరవింద్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

Exit mobile version