Site icon Polytricks.in

రాత్రిళ్ళు హీరోల గదుల్లో ఆ హీరోయిన్స్ – గుట్టువిప్పిన కంగానా

బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన పోస్ట్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె ట్వీట్ చేసింది. ఉన్నట్టుండి ఎందుకు ఈ సంచలన పోస్ట్ చేసిందో తెలియదు. కానీ ఆమె బాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.

కంగనా తన ట్వీట్లో…బాలీవుడ్ మాఫియా నా యాటిట్యూడ్ ని పొగరుగా చిత్రీకరిస్తుంది. ఎందుకంటే నేను ఇతర హీరోయిన్స్ మాదిరి చిలిపి నవ్వులు నవ్వడం, ఐటెం సాంగ్స్ చేయడం, చీర కట్టుకొని డాన్స్ చేయడం, హీరోలు పిలవగానే రాత్రి గదికి వెళ్లడం చేయను. అందుకే వారు నన్ను పిచ్చిదానిగా చిత్రీకరించి జైలుకి పంపాలని చూస్తున్నారని పోస్ట్ చేసింది.

కంగనా ట్వీట్ ను సునిశితంగా పరిశీలిస్తే.. ఆఫర్స్ కోసం ఇతర హీరోయిన్స్ హీరోలతో బెడ్ షేర్ చేసుకుంటారని, వాళ్ళను ఎంటర్ చేస్తారని ఆమె ఆరోపణలు గుప్పించింది. కంగనా రనౌత్ మరొక ట్వీట్లో… నాకు ఈ యాటిట్యూడ్ మా అమ్మ నుండి వచ్చింది. నేను ఒక స్టార్ హీరోయిన్ అయినా మా అమ్మ ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంది. ఆమె 25 ఏళ్ళు టీచర్ గా పనిచేశారు. మా కుటుంబంలో రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఉన్నారని పోస్ట్ చేశారు.

కంగానా రనౌత్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ చేసిందని బాలీవుడ్ చర్చించుకుంటుంది.

Exit mobile version