Polytricks.in

అన్ని సర్వేలు ఒక లెక్క…పాలిట్రిక్స్ మరో లెక్క.. గాలివాటం కాదు..జూబ్లీహిల్స్‌ నాడి తెలిపిన సర్వే

సర్వేలు చేయడం అంటే గాలివాటం అస్సలు కానేకాదు. ప్రజల నాడిని ఖచ్చితంగా గుర్తించాలి. కేవలం ప్రచారం మాత్రమే కాదు..ప్రజల్ని ప్రభావితం చేసే అంశాలేవి అనేది విశ్లేషించాలి. నాయకుల కదలికలు, ప్రతి మాటను క్షుణ్ణంగా గమనించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నియోజకవర్గానికి నిజంగా కావాల్సింది ఏమిటి అన్నది గుర్తించాలి. అలా కాకుండా ఏదో ఒక పార్టీ హవా వీస్తుంది…ఒక పార్టీ వినూత్నంగా ప్రచారం చేస్తుందని గుడ్డిగా మూసధోరణిలో రిపోర్టులు ఇచ్చేయడం కాదు.

పాలిట్రిక్స్ నిర్వహించిన సర్వేల్లో ఇవేమీ కనిపించవు. కేవలం గ్రౌండ్‌లో ఉన్నది ఉన్నట్లు చెప్పడం మాత్రమే ఈ సంస్థకు తెలుసు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా పాలిట్రిక్స్ అంచనాలు ఎన్నడూ తప్పుకాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నమొన్నటి ఎన్నికల వరకు వందశాతం స్ట్రైక్‌ రేట్ ఉన్న ఏకైక సంస్థ పాలిట్రిక్స్ మాత్రమే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికల్లో కానీ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జనరల్ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్క ఎన్నికలో ప్రజల అభిప్రాయాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగాం.

 

2023 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ మూడవ స్థానంలో ఉంటుందని చెప్పిన ఏకైక సంస్థ పాలిట్రిక్స్ మాత్రమే. అంతేకాదు ఎవరికి ఎంత పర్సంటేజ్ వస్తుందనేది కూడా ఖచ్చితంగా చెప్పగలిగాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీగణేష్‌ గెలుపుతో పాటూ ఎంపీ ఎన్నికలో మాత్రం బీజేపీకి మెజార్టీ వస్తుందని పక్కాగా లెక్కలతో సహా చెప్పాం. అంతేకాదు గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలో ఫలితాలను కూడా ఖచ్చితంగా చెప్పిన ఏకైక సంస్థ పాలిట్రిక్స్ మాత్రమే.

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో ప్రతి బూత్‌ నుంచి సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే పాలిట్రిక్స్ సంస్థ ఒపీనియన్ పోల్‌ కానీ ఎగ్జిట్ పోల్ కానీ విడుదల చేసింది. ఏదో గాలివాటంలాగా కాకుండా ఓటర్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని పక్కా లెక్కలతో విశ్లేషించింది. డివిజన్ల వారీ ఓటర్ల నాడి ఎలా ఉంది. కులాల వారీగా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారని లోతుగా చెప్పిన సంస్థ కూడా పాలిట్రిక్స్ మాత్రమే.

సర్వే అనగానే అంకెల గారడీ అన్నట్లు..గాలిఎటు వీస్తే అటు ఎక్కువ శాతం ఓట్లు ఇచ్చేయడం కాకుండా…శాస్త్రీయపద్దతిలో శాంపిల్స్ సేకరణ చేసింది పాలిట్రిక్స్. అంతేకాదు ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తూ..ఆచితూచి ఎగ్జిట్ పోల్‌ ఇచ్చింది.

Exit mobile version