Site icon Polytricks.in

ఏడు పదుల వయసులో జయసుధ రెండో పెళ్లి..నిజమేనా..?

సహజనటి జయసుధ నాటి స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తునే ఉన్నారు.

ఇప్పటికే ఎన్నో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన జయసుధ ఇప్పటికీ కొన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. హీరోయిన్ కంటే కూడా ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు.

ఆరు పదుల వయస్సు దాటి ఏడు పదుల వయసుకు సమీపిస్తోన్న జయసుధ మరో పెళ్లికి సిద్దమైందంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలం కిందట ఆమె భర్త మరణించడంతో ఆమె రెండో పెళ్లికి రెడీ అయిందని ప్రచారం జరిగింది.

మరోవైపు.. ఒంటరితనం అనుభవించలేక మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుందని వార్తలు వస్తున్నాయి. వీటిపై చాలామంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఏడు పదుల వయసులో పెళ్లి ఏంట్రా అని తప్పుబట్టారు.

అయిన జయసుధ రెండో పెళ్లి వార్తలకు బ్రేక్ పడకపోవడంతో స్వయంగా వీటిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరో కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది.

తన గురించి దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జయసుధ. సోషల్ మీడియాలో పోస్టింగులు తనను మరింత భాదించినట్లు చెప్పుకొచ్చారు జయసుధ.

Also Read : ప్రొడ్యుసర్ తో పెళ్లి వార్తలపై సురేఖ వాణి క్లారిటీ

Exit mobile version