Site icon Polytricks.in

చిలకలూరి పేటలో తనకు ‘చేతకాదు’ అని చేతులు ఎత్తేసిన జగన్?

చిలకలూరి పేట దేనికి ప్రసిద్దో అందరికి తెలుసు. ఒకప్పుడు అది దేశంలోనే శృంగార రాజధాని ఎంతగా పేరు సంపాదించిందో కూడా తెలుగు ప్రజలకు తెలుసు. చిలకలూరి పేటతో పాటు పెద్దాపురం, మండపేట లాంటి ఏరియాల్లో ‘రామా’ అన్నా అందులో బూతు వెతుకుతారు శృంగార ప్రియులు.

మరి అలాంటి చిలకలూరి పేటలో జగన్ బహిరంగంగా మాట్లాడుతూ ‘నాకు చేతకాదు’ అనేసరికి సభ ఒక్కసారిగా గొల్లుమంది. అందులోను ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంబిస్తూ. అందులోను ఆ చిలకలూరి పేటలో మొదటి సారి ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే పథకాన్ని ప్రారంబిస్తూ.

జగన్ మాటలను మొదట జనం అపార్థం చేసుకున్నా తర్వాత నిజం తెలుసుకుని మరోసారి నవ్వుకున్నారు. ఆయన మాట్లాడుతూ”నాకు మోసం చేయడం చేతకాదు. నాకు అబద్దాలు చెప్పడం చేతకాదు. నాకు జిత్తులమారి నక్కలా ప్రవర్తిచడం చేతకాదు. నాకు కుట్రలు కుతంత్రాలు చేయడం చేతకాదు” అన్నారు.

అయితే తెలుగు దేశం తమ్ముళ్ళు మాత్రం ఈ మాటలకూ కడుపుబ్బా నవ్వి ”వీడి బండ బడా. బ్రమ్మానందంకుమల్లే జగన్ కూడా భలే కామెడీ సేత్తాడు. మరి ఇవన్ని సేతకాకపోతే … నాయాల్ది…. జైలులో సిప్పకూడు ఎందుకు తిన్నట్లు? ఎట్టా సిఎం గా ఎదిగాడు? మొత్తానికి భలే కామెడీ సేసి నవ్విత్తాడు….వీడి బండ బడా” అని ఒకటే నవ్వులు.

Exit mobile version