Site icon Polytricks.in

చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లను కలిపిన జగన్ రెడ్డి..!

పవన్ కళ్యాణ్ , చంద్రబాబులు మళ్ళీ ఒకటి అవుతున్నారు. గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను కలిసి పోటీ చేదామని చంద్రబాబు కోరారు. కాని పవన్ మాత్రం తన బలమేంటో నిరూపించుకుంటానని.. ఒంటరిగా పోటీ చేశారు. దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీతో దూరంగానే ఉండిపోయారు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి సాగిన ఎలాంటి ప్రయోజనం లేదని.. ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇక టీడీపీకి దూరం అయినట్లేనని అందరూ అనుకున్నారు.

మళ్ళీ ఇప్పుడు టీడీపీతో కలిసి నడించేందుకు అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్.అయితే, ఆయన ఉన్నట్టుండి టీడీపీకి మద్దతు తెలిపేందుకు కారణం జగన్ రెడ్డే. అధికారం ఉందనే అహంకారంతో రాజకీయ నాయకులను వేధించడం..కొత్త జీవోలు అమలు చేసి ప్రతిపక్ష నాయకులను జనాల్లోకి వెళ్ళకుండా చేయాలనుకుంటున్నారు జగన్. ఇవే పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య ఐక్యతకు దారితీస్తున్నాయి. విడివిడిగా ఉంటే జగన్ ను ఎదుర్కోవడం కష్టమని నేతలు గ్రహిస్తున్నారు.

చంద్రబాబును అడ్డుకున్నట్లే.. పవన్ కళ్యాణ్ ను కూడా అడ్డుకుంటున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకున్నారు. ఆయన సినిమాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. పవన్ మీద కక్షతో సినీరంగాన్ని కూడా దెబ్బతీయాలనుకున్నారు. దీంతో జగన్ కు ఎలాగైనా బుద్ది చెప్పాలనుకున్నారు పవన్.

జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుడదని నిర్ణయానికి వచ్చారు. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని కలుకుపోవాలని పవన్ భావించారు. అందుకే చంద్రబాబు ఇంటికెళ్ళి పవన్ కలిశారు. దీనికి కారణం మాత్రం జగన్ మోహన్ రెడ్డే.

Also Read : చంద్రబాబుతో రజినీకాంత్ భేటీ- ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?

Exit mobile version