Site icon Polytricks.in

చంద్రయాన్ -3పై బిగ్ అప్డేట్ – వీడియో రిలీజ్ చేసిన ఇస్రో

చంద్రయాన్ -3 గురించి ఇస్రో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. చంద్రునిపైకి పంపిన ఉపగ్రహం చంద్రుడికి సంబంధించి తీసిన వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో చంద్రుడు బూడిద కలర్ లో కనిపిస్తున్నాడు. చంద్రుని రెండో కక్ష్యలోకి ప్రవేశించే ముందు ఉపగ్రహం ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది.

చంద్రుడిపై పరిశోధన చేసేందుకు ఇస్రో జూలై 14న చంద్రయాన్-3 పేరుతో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఆగస్ట్ 1న చంద్రుని కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం…ఆగస్ట్ ఆరున చంద్రుడికి సంబందించిన వీడియోను తీసింది. ఈ వీడియోను ఆదివారం ఇస్రో విడుదల చేసింది.

ఈ ప్రయోగం ఫలితం ఆగస్ట్ 23న తేలనుంది. ఆ రోజున చంద్రుడిపై ఉపగ్రహం అడుగు పెట్టనుంది. ఇప్పటివరకు విజయవంతంగా కొనసాగుతూ వచ్చిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనని ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు.

గతంలో చంద్రయాన్ – 2 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగా…అది చంద్రుడిపై దిగే క్రమంలో ఫెయిల్ అయింది. కానీ ఈసారి అలాంటిది రిపీట్ కాకుండా ఉండేలా చర్యలు చేపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Also Read : కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న బీజేపీ..!!

Exit mobile version