Site icon Polytricks.in

అధికారిని పీక్కు తిన్న వీధి కుక్క?

నగరంలో పసిపిల్లాను పీక్కుతిన్న వీధి కుక్కలు స్వైర విహారం చేసున్నాయి. నిన్న ఓ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిషువును కుక్క ఎత్తుకుపోయి చంపుకు తిన్నది. ఈరోజు ఏకంగా సిద్ధిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని ఓ వీధి కుక్క తీవ్రంగా కరిచింది.

అతను ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తూ ఉంటే ఆ కుక్క ఒక్కసారిగా దాడి చేసి రెండు కాళ్ళ పిక్కలను పీక్కు తిన్నది. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అతను ఐ సిలో సీరియస్ గా ఉన్నారు. ఇదే కుక్క కలెక్టర్ ఆఫీస్ లో మరో ఇద్దరు ఉద్యోగులను లోగడ కరచింది అని తెలిసింది. మరి సిబ్బంది ఏం చేసున్నారో వారికే తెలియాలి.

లోగడ ఇంలాటి సంఘటనలు హైదరాబాద్లో ఎన్నో జరిగాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. ఇవి రోజు జరిగే సంఘటనలే. ఇలాంటి వార్తలను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ చాలా తేలికగా తీసుకున్నారు. ఆమె జంతు ప్రేమికురాలు. ఎలాంటి నివారణ  చర్యలు తీసుకోవడం లేదు. ”పిల్లలను కుక్కలు కరుస్తూ ఉంటే పెద్దలు ఏం చేసున్నారు?” అని మీడియా ద్వారా జనాన్ని రివర్స్ గేర్ లో నిలదీసి సంచలనం సృష్టించారు. కానీ ఆమె ఇక్కడ మనిషి సైకాలజీ గురించి తెలుసుకోవాలి.

మన మీదికి ఓ ప్రాణి దాడి చేస్తే ముందుగా భయం వేస్తుంది. ఆ భయంతో బుర్ర పని చేయడం మానుకుంటుంది. దానిని ఎదిరించాలి అనే ఆలోచన అస్సలు రాదు. దాని బారినుంచి నుంచి తప్పించుకోవాలి అనే ఆతృతతో ముచ్చెమటలు పడతాయి. వెన్నులో చలి పుడుతుంది. నవనాడులూ చల్లబతాయి.

ఆ దాడి చేసేది ఓ పులి కావచ్చు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు చివరికి బల్లి, జిల్లపురుగు కూడా కావచ్చు. భయం ముందు అన్నీ సమానమే.  అవి మీద పడితే ముందు భయంతో కేకలు వేయడం పరిపాటి. అది పిల్లలైన , పెద్దలైనా  ఒక్కటే. ఆమె మీద బల్లి, లేదా జిల్లపురుగు పడితే కేకలు వేసారో, లేక చిరు నవ్వుతో వాటిని ప్రేమిస్తారో ఆమెకే తెలియాలి.

అసలు కుక్కలు ఎందుకు ఇలా  ప్రవర్థిస్తాయి?

కుక్క విశ్వాసానికి మారు పేరు. అన్నం పెట్టిన చేతిని కరవని ఏకైక ప్రాణి. మనిషిలా విశ్వాసఘాతకానికి అస్సలు పాల్పడవు. కోడి పిల్లను చంపినా, పిల్లి పిల్లను చంపినా ముద్ద మాంసం దొరుకుతుంది, కానీ మనిషిని కరిస్తే ఏమీ దొరకదు అని కుక్కలకు బాగా తెలుసు. అయినా అవి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లు మనుషులను కసితీరా కరుస్తాయి. వీధి కుక్కలే కాదు, పెంపుడు కుక్కలు కూడా యజమానికి కరుస్తాయి.

దీనికి కారణం చాలామందికి తెలియదు. కుక్కకు పిచ్చిపట్టింది అని కొట్టి పడేస్తారు. కానీ నిజం అది కాదు. వాన కురవగానే ప్రకృతి పరంగా చాలా జంతువులకు సెక్స్ మూడ్ వస్తుంది. అవి వెంటనే జతకడతాయి. ఆ గుణం కుక్క, నక్క, తోడేళ్ళ జాతికి కూడా ఉంది.

వాన కురువకపోయినా అవి తన సంతాన ఉత్పత్తి చేసుకోవాలని ఆరాట పడతాయి. ఈ సృష్టిలో అన్ని ప్రాణులు కేవలం సంతాన ఉత్పత్తి కోసమే రాతిలో పాల్గొంటాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే ఎంజాయ్ కోసం రాతిలో రోజు పాల్గొంటాడు. అది వేరే విషయం.

ఆడ కుక్కల్లో అండం విడుదల కాగానే మగ కుక్కతో జత కట్టాలని  ఆరాటపడుతుంది. అందుకే అది గొంతు చినిగేలా సెక్స్ మూడ్ లో మొరుగుతుంది.

అది అర్థంకాని  మనం, అది ఎవరినో చూసి మొరుగుతోంది అనుకుంటాము. దానికి అందుబాటులో మగ కుక్క తోడు లేకపోతే కోపం కట్టలు తెగుతుంది. అందుకే ఆ కోపాన్ని  మనుషుల మీద చూపిస్తూ ఇలా కరుస్తుంది. యజమానిని కూడా కరుస్తుంది.

అలాగే మగ కుక్క మూడు నెలల్లో ఒక్కసారైనా రాతిలో పాల్గోవాలని చూస్తుంది. అందుబాటులో ఆడ కుక్క లేకపోతే సెక్స్ మూడ్ లో అది కూడా గొంతు చినిగేలా మొరుగుతుంది. అది అర్థంకానీ మనం, అది ఎవరినో చూసి మొరుగుతోంది అనుకుంటాము. దానికి అందుబాటులో ఆడ కుక్క జతకట్టడానికి  లేకపోతే కోపం కట్టలు తెగుతుంది. అందుకే ఆ కోపాని మనుషుల మీద చూపిస్తూ ఇలా కరుస్తుంది. యజమానిని కూడా కరుస్తుంది.

ఈ చిన్న లాజిక్ తెలియని మనిషి, కుక్కకు పిచ్చిపట్టింది అని అపార్థం చేసుకుంటాడు. కుక్కలు దెయ్యాలను చూసి రాత్రంతా మొరుగుతున్నాయి అని, దానికి ఏదో రోగం వచ్చి మొరుగుతోంది అని చెప్పుకుంటారు. అది తప్పు. అందుకే కుక్కలను పెంచుకునే వాళ్ళు ఆడ, మగ జాతులను కలిపి పెంచుకోవాలి. లేదా వాటి ఆగ్రహానికి ఇలా బలికావలసిందే.

Exit mobile version