Site icon Polytricks.in

లోక్ సభ స్పెషల్ సెషన్స్ ఎజెండా ఇదేనా..?

ఈ నెల 18నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది కేంద్రం. సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం ఈ సమావేశాల ఎజెండా ఏంటో మాత్రం పేర్కొనలేదు. పలు కీలక బిల్లులను ఆమోదించేందుకునేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురాబోయే ఐదు బిల్లులు ఇవేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుతోపాటు రోహిణి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

వీటిలో కొన్ని బిల్లులు రాజ్యసభలో వీగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభలో అధికార బీజేపీకి సరిపడా సభ్యులు లేరు. దీంతో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వంటి కీలక బిల్లులకు బ్రేక్ పడుతుందా..? అనే చర్చ ఆసక్తి రేపుతోంది.

Also Read : బీజేపీలో మళ్ళీ వర్గపోరు – కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల..?

Exit mobile version