Site icon Polytricks.in

మంత్రి జి.కిషన్‌రెడ్డి పరిస్తింతి ఇంకా ఆందోళనకరం?

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి ఆదివారం రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతిలో నొప్పివచ్చి ఒక్కసారిగా కుప్పగాకులిపోయారు. అయన కుటుంబసభ్యులు వెంటనే ఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ఆసుపత్రికి 10:50 గంటల సమయంలో హుటా హుటినా తరలించారు. వైద్యులు ఆయనకు అన్నిరకాల పరీక్షలు చేశారు.

సోమవారం ఉదయం వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే జి.కిషన్‌రెడ్డికి ఛాతి నొప్పి రావడానికి కారణం గ్యాస్ సమస్య అని వైద్యులు తేల్చారు. ఆయన కొంత కాలంగా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  అందుకే కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. అయితే మరో 24 గంటల పాటు ఐసి లో డాక్టర్ల పర్యవవేక్షన్లో ఉంచాలని సూచించారు.

Exit mobile version