Site icon Polytricks.in

ఆ ప్రభుత్వం దొంగనోట్లు ముద్రిస్తోందా?

వచ్చే అసంబ్లీ ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి దొంగ నోట్లు ముద్రించి ఓటర్లకు  పంచడానికి పథకం రచిస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మొదటినుంచి అవినీతి, అక్రమాలకూ పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన అనుభవం, నేర చరిత్ర ఉన్నదని ఎద్దేవా చేసారు. ఆయనకు గెలుపే ముఖ్యం, ఆ గెలుపు కోసం ఎలాంటి అక్రమాలకైనా వెనుకాడదని, దేనికైనా తెగిస్తాడని మునుపెన్నడూ లేని విధంగా తీవ్రంగా ఆరోపించారు. ఓటర్లకు దొంగ నోట్లు పంచి గెలిచేందుకు ఇప్పటినుంచే కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు.

అసలు వైసీపీ గాలికి పుట్టిన పార్టీ అన్నారు. దానికో బ్రాండ్, ఓ ఇమేజ్, ఓ స్టాంప్ లేదని ఎద్దేవాచేశారు. అది ఒక అనాథ పార్టీ అన్నారు. దానికి తండ్రి ఎవ్వరో కూడా తెలియని ఫుట్ పాత్ పార్టీ అని దుయ్యబట్టారు.

కానీ తెలుగు దేశం పార్టీ కి ఓ బ్రాండ్, ఓ ఇమేజ్ ఉన్నదని గర్వంగా చెప్పారు. 2019 తర్వాత రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీనే ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి సైకో పాలన కోనసాగుతోంది అని ఆందోళన చెందారు. స్వాతంత్య్రం వచ్చాక న్యాయ విభాగం అవసరం ఇప్పుడొచ్చినంతగా మునుపు ఎప్పుడూ రాలేదు అని ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సులో కె. అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అయన చాలా తీవ్ర స్టాయిలో జగన్ మీద విరుచుకుపడ్డారు. జగన్కు ట్రల్ని చెదించేందుకు లీగల్ సెల్ మరింతగా కృషి చేయాలి అని తమ కార్యకతలకు చెప్పారు. మొన్న లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో జగన్ కావాలని రోజుకో కేసు పెట్టడం దుర్మార్గం అని బాధపడ్డారు.

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉండాలని తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లీగల్ సెల్ కృషి లేకపోతే తెలుగుదేశం పరిస్థితి క్లిష్టంగా ఉండేది అన్నారు.

Exit mobile version