Site icon Polytricks.in

సినిమా హీరోలను హెచ్చరించిన ఐపిఎస్ సజ్జనార్?

తెలుగు హీరోలల్లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత గొప్ప పేరు ఉన్నదో, తమిళనాట రజనికాంత్ కి ఎంత పేరుందో, హిందీ సినిమాలల్లో అమితాబ్ బచ్చన్ కి ఎంత గొప్ప పేరు ఉన్నదో ఇండియన్ పోలిస్ డిపార్టుమెంటు లో ఐపిఎస్ ఆఫీసర్ వి సి సజ్జనార్ కు అంతే గొప్ప  పేరు ఉన్నది. మరి అలాంటి స్టార్ హీరోలను సూపర్ స్టార్ ఆఫీసర్ సజ్జనార్ హెచ్చరికలు జారి చేస్తే ఎలా ఉంటుంది?

లోగడ నలుగు దుర్మార్గులు ‘దిశ’ ను రేప్ చేసి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు దేశాన్ని అల్లకల్లోలం చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ నలుగురు రేపిస్తులను, ఆమెను రేప్ చేసి, సజీవ దహనం చేసిన చోటే సజ్జనార్ కాల్చి చంపారనే ఆరోపణ ఉన్నది. ఆ దీనురాలి ఆత్మకు శాంతి చేకూర్చారు అనే నిందలు ఇతని మీద ఉన్నాయి.

యావత్తు భారతావని మహిళలు సజ్జనార్ ఫొటోకు పాలతో అభిషేకం చేసి అతనికి అభిమానులుగా మారిన విషయం తెలిసిందే. మన దేశ చరిత్రలో ఓ ఐపిఎస్ అధికారికి ఇలా అభిమానులు ఉండడం అతని ఒక్కడికే చెల్లింది. సినిమా హీరోలకు అతనికి తేడా ఒక్కటే. హీరోలు తెరమీద నటిస్తారు. ఆయన నిజ జీవితంలో జీవిస్తారు.

కానీ ఇది తప్పని, చట్టాని అతికమించడం నేరమని మహిళా కమిషన్ సజ్జనార్ మీద కేసు వేసినప్పటికీ అతను జంకలేదు. అతను ఎవ్వడికి భయపడదు. ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగరు. ఆయన ఉద్యోగ ధర్మం నమ్ముకున్నారు. ఆ విధి నిర్వహణలో ‘సింగం’ లా ఉంటారు. ‘సింగం’ రెండు పార్ట్ సినిమాలల్లో సూర్య పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర సజ్జనార్ క్యారెక్టర్ ప్రేరణ అని కొద్ది మందికి మాత్రమే తెలుసు.

మన హీరోలు తెర మీద దుష్టులను ఏరి పారేస్తే, వి సి సజ్జనార్ నిజ జీవితంలో దుష్టులను ఏరిపారేయడంలో దిట్ట. ఇతని పని తీరును సీన్లుగా చాలా సినిమాలల్లో కాపీ కొడతారు. అతని ఆటో బయోగ్రఫీ మీద ఓ సినిమా కూడా రాబోతోంది. ఇప్పుడు అతను తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాంటి సూపర్  స్టార్ సజ్జనార్ తన కర్తవ్యపాలనను మరువలేదు.

ఈ మధ్య కొన్ని బోగస్ కంపననీల వ్యాపార ప్రకటనలలో ఇండియన్ సూపర్ స్టార్లు డబ్బుకు ఆశపడి నటిస్తున్నారు. అమాయక జనం ఆ వ్యాపార ప్రకటనలు నమ్మి, ఆ కల్తి వస్తువులు కొని ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. ఇందులో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చను ముందు వరుసలో ఉన్నారు. ఈ మద్య అమితాబచ్చన్ ‘ఆమ్వే’ అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థను ప్రమోట్ చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఆమ్వే వంటి కంపెనీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది బోగస్ కంపెని అని ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఈ సంస్థపై విచారణ జరుగుతోంది. ఈడీ ఈ కంపెనీ యొక్క ఆస్తులను జప్తు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది.

కనుక ఆమ్వే పై ఉన్న కేసులన్నీ దృష్ట్యా ఇలాంటి సంస్థలకు ప్రమోషన్ చేయవద్దని వి సి సజ్జనార్ సున్నితంగా అమితాబ్ బచ్చన్ని హెచ్చరిస్తూనే ఎంతో వినయంతో విజ్ఞప్తి చేశారని తెలిసింది. ఈ విషయమై అమితాబ్ ఇంకా స్పందించలేదు.

వందల కోట్ల ఆదాయం కలిగి ఉన్న అమితాబచ్చన్ ప్రమోషన్ చేసే కొన్ని కంపెనీలు జనాలను గతంలో మోసం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినా కూడా బచ్చన్ వాటిని పట్టించుకోకుండా డబ్బు కోసం ప్రమోషన్ చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని అందరికంటే ముందుగా సజ్జనార్ స్పందించారు. దానిని అడ్డుకోవాలని చూస్తున్నారు.

ఇలాంటి కొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు గతంలో కొన్ని వేల మంది జీవితాలతో ఆడుకున్నాయి. వీటిమీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నయి. ఇవి కొన్ని బోగస్ కంపనీలకు కొమ్ము కాస్తున్నాయి అనే పుకార్లు కూడా ఉన్నాయి. కేవలం అమితాబ్నే కాకుండా తెలుగులో కూడా కొన్ని ఫ్రాడ్ కంపెనీల వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్న తెలుగు, తమిళ హీరోలను కూడా అయన చాలా సున్నితంగా మందలిస్తూనే, ఎంతో వినయంతో విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఈ హీరో కూడా ఆయనకు ఎదురు చెప్పలేదు. సజ్జనారా మజాకా?

Exit mobile version