Site icon Polytricks.in

బ్రేకింగ్ – ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఇంటర్ ద్వితీయ పరీక్షలను జరపనున్నారు. ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

ప్రాక్టికల్స్ పరీక్షలను ఏప్రిల్ 15నుంచి 25వ తేదీ వరకు…ఏప్రిల్ 30నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం , మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఈమేరకు ఏపీ ఇంటర్ బోర్డు టైం టేబుల్ ను ప్రకటించింది.

ఇంటర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంట్ ఎద్యూకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

Exit mobile version