Site icon Polytricks.in

హరిహర వీరమల్లుకు హైపర్ ఆది హెల్ప్

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవన్ స్టార్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇకపోతే, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కంప్లీట్ చేసి పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read : హైపర్ ఆదిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి – కారణం రోజానేనా..?

ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. జబర్దస్త్ కమెడియన్, పవర్ స్టార్ అభిమాని హైపర్ ఆది హరిహర వీరమల్లు సినిమాకు రైటర్ గా పని చేస్తున్నాడట. పూర్తిస్థాయిలో కాకుండా కామెడి సీన్స్ కోసం అది హెల్ప్ ను మేకర్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో తన మార్క్ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించే ఆది హరిహర వీరమల్లు సినిమాలో కామెడి సన్నివేశాలకు కామెడి సీన్స్ ను రూపొందిస్తున్నారట. దర్శకుడు క్రిష్… హరి హర వీరమల్లు కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది చేత డైలాగ్స్ రాయించారని విశ్వసనీయ సమాచారం.

హరిహర వీరమల్లు సినిమాకు పూర్తిస్థాయి రచయితగా సాయిమాధవ్ బుర్రా పని చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కూడా ఈయనే మాటలు సమకూర్చారు. కొన్నాళ్ళుగా క్రిష్ తెరకెక్కిస్తోన్న సినిమాలకు సాయి మాధవ్ బుర్రానే రైటర్ గా వ్యవహరిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో కామెడి సీన్ డైలాగ్ ల కోసం మాత్రం హైపర్ ఆది హెల్ప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈమూవీలో ఆది కామెడి రోల్ కూడా పోషిస్తున్నారు.

Exit mobile version