Site icon Polytricks.in

లీటరు పెట్రోల్ ధ‌ర రూ.331.. డీజీల్..రూ.329.. ఎక్కడో తెలుసా..?

అవును.. మీరు చదివింది నిజమే. లీటర్ పెట్రోల్ ధ‌ర రూ.331.38లు కాగా..డీజిల్ రూ.329.18లకు చేరింది. ఇది మరెక్కడో కాదు మన పొరుగు దేశం. పాకిస్తాన్ లో. పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. సొంత వాహనాలపై ప్రయాణించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇంధన ధరలు పెరిగితే అన్ని వ్యవస్థలపై దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.26.2 పైసలు, డీజిల్ ధ‌ర‌ను రూ.17.34 పైసలు పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.331.38, డీజిల్ ధ‌ర రూ.329.18 కు చేరింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు. ఓ వైపు ఇందన ధరలు పెరుగుతుంటే సర్కార్ మాత్రం ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని చెప్తుంది. ధరలను అదుపు చేయడంలో విఫలం అవుతూ ప్రజలను ఏవిధంగా ఆదుకుంటారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

పాకిస్తాన్ లో రోజురోజుకు పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. ధరల పెరుగుదలతో పేదల జీవితాలు ప్రమాదంలో పడటం ఖాయం. పాకిస్తాన్ కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అక్కడ చిన్న వస్తువులు సైతం ఫిరమైయ్యాయి. పరిస్థితికి కొంత అదుపులోకి వస్తుందని అంచనా వేసినప్పుడల్లా మళ్ళీ సిట్యుయేషన్ రివర్స్ అవుతోంది.

Also Read : ఎన్నికలు ఇప్పట్లో లేవు – తెలంగాణలో రాష్ట్రపతి పాలన..?

Exit mobile version