Site icon Polytricks.in

ఎన్నికల కమిషన్ కు తలనొప్పులు? గందరగోళంలోపడ్డ కంటోన్మెంట్ ఉపఎన్నికలు!

కంటోన్మెంట్ నియోగాకవర్గం సిట్టింగ్ ఏమ్మెల్లె జి. సాయన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఒక నియోగాకవర్గంలో ఏమ్మెల్లె మరణిస్తే 180 రోజుల్లోగా ఉప ఎన్నికలు జరపడం కేంద్ర ఎన్నికల సంఘానికి అనివార్యం. ఇదే నిబంధన ప్రకారం ఆగష్టు 18 లోగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ నియోగాక వర్గం ఉప ఎన్నికలు జరగాలి. ఈ నిబంధన ప్రకారం ఒకవేళ ఆగష్టు లో ఎన్నికలు జరపవచ్చు. కానీ షెడ్యుల్ ప్రకారం డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలి. అంటే కేవాలం రెండు నెల్ల వ్యవధిలో కంటోన్మెంట్లో మళ్ళి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.

చూస్తూ చూస్తూ రెండు నెలల వ్యవధి కోసం కంటోన్మెంట్లో ఎన్నికలు జరపడం అవసరమా? అనే సందిగ్ధలో పడ్డారు ఎన్నికల సంఘం అధికారులు. ఒకవేళ ఆగస్ట్ లో ఎన్నికలు జరిప్తే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టి ఇబ్బందిలో పడుతుంది.

ఎందకంటే ఎన్నికల ముందే అన్ని పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం బిఆర్ఎస్ పార్టికి వెన్నతో పెట్టిన విద్య. ఒకవేళ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే అన్ని పనులు ఆగిపోతాయి. బిఆర్ఎస్ కు ఇది ప్రాణసంకటమే. అందుకే బిఆర్ఎస్ ఏం చేయాలో తర్జనబర్జన చేస్తోంది. బంతిని ఎన్నికల కమిషన్ కోర్ట్ లో వేసేలా ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రత్యెక అధికారాలు ఉన్నాయి. దాని మెరకు  కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఆగస్టులో కాకుండా, డిసెంబర్ లో జరిగే సాదారణ ఎన్నికలల్లో కూడా జరపవచ్చు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలకు పిలుపును ఇవ్వవచ్చు. ప్రతిసారి బిఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు తోడ కొడుతుంది. ఒకవేళ ఆగష్టు లో ఉప ఎన్నికలకు సిద్దపడితే, ఎన్నికల కోడ్ అమలు చేయమంటే కెసిఆర్ ఊరుకోరు. తన రాజకీయ చరురతతో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని ఎన్నికల సంఘానికి తెలుసు. అందుకే కెసిఆర్ కోర్ట్ లోకి బంతినిని విసిరేలా ఉంది. ఈ ధర్మ సంకటాన్ని అటు ఎన్నికసంఘం, ఇటు కెసిఆర్ ఎలా ఎదురుకుంటారో చూడాలి.

Exit mobile version