దళిత ,బలహీన వర్గ IAS పై వివక్ష ,I am YES అన్న వారికే ప్రాధాన్యత పదవులు

కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక , ఏ వర్గ ప్రజలకైతే సమన్యాయం జరగాలని తెలంగాణ సాధించామో అదే వర్గ IAS ల పై కేసిఆర్ ,KTR , కవిత లు వివక్ష చూపడం అవమానించడం నిత్యకృత్యమై ఎంతో మనోవేదాన్ని అనుభవిస్తున్నారంటే నమ్మలేని నిజం

IAS Union

KTR బహిరంగం గా నాకు కావరం ఉంది అని తనకు తానుగా చెప్పడం , కవిత 4ఏండ్లు మేము పెట్టిన ప్రజా క్షోభ ట్రైలర్ మాత్రమే 3D సినిమా చూపిస్తాం అని చెప్పడం లో వారు దళిత ,,బలహీనవర్గ ప్రజలను ఏ విధం గ పీడిస్తున్నారో చెప్పకనే చెబుతున్నారు.

కొందరు IAS లు KTR తో కలిసి కుల వివక్ష కు తేరా తీశారని ఆరోపిస్తున్నారు . తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం గడీల ముందు మొకరిల్లి డోరా మెప్పు కోసం ఉద్దేశ పూర్వకం గ వివక్ష చూపుతున్నారని ఆరోపణ

గత ప్రభుత్వాలు అనుసరించిన అన్నిరకాల విధానాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. తమను లక్ష్యంగా చేసుకొని అప్రాధాన్య పోస్టుల్లో నియమిస్తోందని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఇచ్చే సలహాలను నోటి మీదే నవ్వడం ,హేళన గా మాట్లాడటం ఈ ప్రభుత్వం లోనే చూశామని వాపోయారు .

ఒక ఐఏఎస్‌ అధికారి దళితుల సాంప్రదాయక భోజనానికి మద్దతు తెలిపితే గిట్టలేదు . పౌష్టికాహార సముపార్జన హక్కు గ మాట్లాడటం రుచించలేదు కెసిఆర్ కు

ఎన్నో ఏండ్లు విద్య కు దూరమయిన కొన్ని కులాల నుండి ఉన్నత ఉద్యోగం పొంది సమ సమాజ స్థాపన కు స్ఫూర్తిదాయకం ఐన వారిని కెసిఆర్ & కో వివక్ష చూపడం హేయమైన చర్య .

నిమ్న జాతి వర్గాలకు చెందిన దాదాపు 20 మంది IAS లు ఏకమయి సమావేశం అయ్యారు ( తెలంగాణ లోకల్ మురళి, అశోక్‌, బాల మాయాదేవి, భారతీ లక్‌పతి నాయక్‌, చంపాలాల్‌, కేవై నాయక్‌, ఎల్‌.శర్మన్‌, డీవీ రావు, కె.లక్ష్మి, అర్విందర్‌సింగ్‌, అజీం, బూసాని వెంకటేశ్వర్లు, ఆర్వీ చంద్రవదన్‌, కిషన్‌, ఎల్‌.శశిధర్‌, ఎం.వీరబ్రహ్మయ్య, అమేయకుమార్‌, అనితా రాజేంద్ర, దినకర్‌బాబు, బుర్రా వెంకటేశం)

ఉద్దేశ పూర్వకం గ కుల వివక్ష చేస్తూ కెసిఆర్ ప్రభుత్వం అప్రాధాన్య పోస్టుల్లో నియమించిందని ,వివిధ సందర్భాల్లో కవిత ,KTR లు తమ తో ప్రవర్తించిన తీరు ను వెల్లడించి తమ మనస్సుల్లో దాచుకున్న భాధ వెళ్లగొట్టారు .

తెలంగాణ ,లోకల్ కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఐఏఎస్‌ లకు ప్రాధాన్యత పోస్ట్ లు ఇచ్చి తమను అవమానిస్తోందని పేర్కొన్నారు.

తమ మాట వినే వారిని ,తమ గుట్టు బయట పడకుండా ఉండటం కోసం అనర్హత గల వారిని నాన్‌ ఐఏఎస్‌లు, విశ్రాంత అధికారులైన వారిని నియమిస్తూ ఎంతో మనోవేదన కు గురి చేస్తుందని అంటున్నారు

ఎస్టీ మహిళా ఐఏఎస్‌ భారతీనాయక్‌ గత నాలుగేళ్లుగా సచివాలయంలోనే ఇలా పనిచేస్తున్నారు.ఎలాంటి పదోన్నతి కల్పించకుండా నెట్టివేయబడుతున్నారు .

శ్రీ తేజావత్ రామచంద్రుడు గారు ( మాజీ IAS అధికారి ) దశాబ్దాల స్వప్నం సాధించుకున్న తెలంగాణ లో నా జాతి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్నా వారికి సరైన స్థానం కల్పించలేదని వాదన ఉంది .

ప్రభుత్వం ఏర్పడగానే దళిత బిడ్డ రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి నుండి అవినీతి పేరున పక్కన పెట్టారు , మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గారికి గన్ మెన్ లను తొలగించారు . నేరెళ్ల లో దళిత కుటుంబాల పై దౌర్జన్యకాండ , 4 ఏండ్లు గ దళిత IAS ల పై వివక్ష ,వేధింపులు గురి చేసి మనో వేదన కు కారణమయ్యారు

BC కి చెందిన మంత్రులను ఉత్సవ విగ్రాహాలకే పరిమితం చేశారు

ఆర్ధిక మంత్రి గ ఢిల్లీ లో GST సమావేశాలకు ,ప్రధాని సమావేశాలకు శ్రీ ఈటెల రాజేందర్ వెళ్లారు , పురపాలక మంత్రి KTR వెళ్తారు ,
ఎక్సయిజ్ శాఖా గురించి సంబంధిత మంత్రి శ్రీ పద్మ గౌడ్ గారు మాట్లాడరు .IT మంత్రి KTR మాట్లాడుతారు
ఉద్యమ నాయకుడు శ్రీ స్వామి గౌడ్ గారిని మంత్రి ని చేస్తానని చెప్పి పెద్దల సభ పేరుతో కట్టి పడేశారు .

వేమన చెప్పిన కనక సింహాసనం మీద శుభ లగ్నాన ….. పద్యం లో చెప్పినట్లు స్వతహా గా దొరహంకారం కలిగిన కెసిఆర్ ,KTR లకు అధికారం దక్కగానే వారి అహంకారం తో తలపండిన మేధావులను , రిటైర్డ్ ఉద్యోగులను , ఉన్నతాధికారులను , సాధారణ దళిత కుటుంబాల నుండి ఉన్నతాధికారులైన IAS లను కూడా పీడించారు .

అన్నింటికీ ఒక్కటే మార్గం ఒక్కసారి ప్రజా కూటమి కి అధికారం ఇవ్వండి నియంతృత్వ , ఫ్యూడల్ అహంకార కెసిఆర్ పాలన కు చర్మ గీతం గీతం పాడండి

గంప వేణుగోపాల్ ( member of Campaign sub committe – TPCC )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *