మార్కెట్లో రైతుని దోసుకుంటున్న సర్’కార్’ రక్త పింజరాలు

ఈ యేడు అధిక వర్షపాతం వల్ల చాలా చోట్ల పత్తి, వరి దెబ్బతిన్నాయి. ఒచ్చిన దిగుబడి కైనా కనీస మద్దతు ధర(MSP) వస్తే కొంచమైనా రైతులకు తేలికయ్యేది. కని ఇప్పటికి పత్తి మార్కెట్లలో CCI కేంద్రాలు తెరచుకోలేదు, తెరచుకున్నా కొన్ని మార్కెట్లలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణం తో CCI కొనకపోవడం వల్ల అక్కడే రాబందులలెక్క కాసుక్కుసున్న దళారులు చాలా తక్కువ ధరకు కొని రైతుని నట్టేట ముంచుతుర్రు.

TRS Govt cheating former's on MSP
TRS Govt cheating former’s on MSP

అసెంబ్లీ సెషన్స్ లో ఎవరైనా(ప్రతిపక్షం, అధికార పక్షం) ఈ సమస్యని తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారేమో అనుకుంటే అస్సలు ఈ విషయాన్నే లెవనెత్తుతలేరు. ఎందుకంటే ఆ దళారుల పాపంలో అధికార, ప్రతిపక్షాలు భాగమైనందుకేనేమో అనే అనుమానంలో నిజం లేకపోలేదు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రేస్ కొంచమైనా రైతుల సమస్యలను గట్టిగా అసెంబ్లీలో లెవనెత్తితే బాగుండు కాని వాళ్ళు మల్లన్నసాగర్ రైతులమీద లాఠీచార్జి జరిగినా, ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతులకు బేడిలేసిన ఒక్కపారైన సప్పుడు చెయ్యలేదు.ఇప్పుడు సప్పుడు చేస్తారనే నమ్మకం లేదు, అప్పుడే పంట నష్టంతో రైతు ఆత్మహత్యలు మొదలవ్వడం విచారకరం.

మార్కెట్లో దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి మద్దతు ధర వచ్చేలా చెయ్యకుండా ఎకరానికి 4 వేలు పెట్టుబడి ఇస్తే రైతులకు అన్నీ అయిపోతాయి అనుకోవడం మూర్ఖత్వమే అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *