కేసీఆర్ కరెంటు వెలుగుల వెనుక అసలు రహస్యం…. ఈ వెలుగు వెనక శ్రమ ఎవరిదో….?
పార్టీలు ఎవైనా, పాలకులు ఎవరైనా… ప్రబుత్వాలు అనేవి ఎప్పటికి ఉంటాయి. గత ప్రబుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ ప్రభుత్వంలో, ఈసారి మొదలుపెట్టినవి వచ్చే ప్రభుత్వాల హయంలో రావచ్చు. అది సర్వసాధారణం కూడా. అయితే… గత ప్రభుత్వ కష్టాన్ని, ఆలోచనను నాదే అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది…. సరిగ్గా కేసీఆర్ విషయంలోనూ అదే జరిగింది. నేను నిర్వీరామంగా 24 గంటల కరెంటు ఇస్తున్నా… అని గొప్పలకు పోయే కేసీఆర్ కరెంటు వెనుక ఇది అసలు రహస్యం.
తెలంగాణ లో 24 ఘంటల విద్యుత్తు కేసీఆర్ ఘనత అని గొప్పలు చెప్పుకుంటున్న TRS పార్టీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలంటున్నారు విద్యుత్ సంస్థల కార్మికులు. కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కాక…. మొదలు పెట్టిన ప్రాజెక్టులు రెండే. ఒక్కటి యాదాద్రి, భద్రాద్రి 2015 లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు 2018 నవంబర్ వరకు 25% నిర్మాణం కూడా పూర్తి కాలేదు. మరి కేసీఆర్ 24 ఘంటల విద్యుత్ ఎక్కడ నుండి ఇస్తున్నాడు అని అడగొచ్చు. దీనికి సమాధానం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుండి చత్తీస్ ఘడ్ ప్రభుత్వం నుండి మరియు తెలంగాణ లో ప్రైవేట్ సోలార్ విద్యుత్ కంపెనీల నుండి విద్యుత్ కొని ఇస్తున్నాడు అది కాక సెంట్రల్ గవర్నమెంట్ నుండి అదనంగా 1000 MW విద్యుత్ ఇస్తున్నారు. కానీ TSGENCO ద్వారా మాత్రం KCR ప్రభుత్వం ఒక్క మేఘవాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఇప్పుడు తెలంగాణ కు వస్తున్న విద్యుత్ లో సగం 50% ప్రైవేట్ కంపెనీల నుండి కొని ఇస్తున్నారు ఇది గమనించాలి.
గత ప్రభుత్వాలు విద్యుత్ 24 ఘంటలు ఎందుకు ఇవ్వలేదు అంటూ రాజకీయా ఆరోపణలకు దిగుతున్నారు. వాస్తవాలు వారికి కూడా తెలిసినా…. దాన్ని దాచిపెట్టి మరీ, ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉనప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో UPA ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు మొదలు పెట్టారు. దేశం మొత్తం లో 2014-15 సంవత్సరనికి నిర్మాణం పూర్తి అయి ఉత్పత్తి ప్రారంభించినవి. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ కు 16000 కోట్లు రూపాయల మిగులు బడ్జెట్ వచ్చింది. విద్యుత్ లో మాత్రం లోటు ఏర్పడింది తర్వాత 2015 నుండి దేశం మొత్తం లో ప్రైవేట్ , గవర్నమెంట్ విద్యుత్ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించినై. ఆ విద్యుత్ వచ్చినప్పటి నుండి విద్యుత్ కొని తెలంగాణ రైతులకు అదనంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. అంటే విద్యుత్ కొని ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ TSGENCO ద్వారా ఉత్పత్తి చేసింది మాత్రం లేదు. తెలంగాణ లో మిగులు డబ్బు ఉంది కాబట్టి విద్యుత్ కొని ఇస్తున్నారు. పైగా ఈ విద్యుత్ కొనుగోళ్లలో కూడా అవినీతి ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
విద్యుత్ ఉన్నప్పుడు, కొనివ్వడానికి ఏం సమస్య. పైగా… మిగులు బడ్జేట్ రాష్ట్రం. అందుకే… డబ్బులు వచ్చినంక విద్యుత్ కొని ఇవ్వడానికి కేసీఆర్ ఏ అవసరం లేదు అక్కడ ఏ CM ఉన్న అదికారులు ఎవరు ఉన్న కొని ఇస్తారు. కానీ ఇక్కడ ప్రచారం మాత్రం ఏదో కేసీఆర్ ఇంట్లో నుండి ఇస్తున్నట్టు TRS వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సొమ్ము ఒకడిది, కష్టం మరొకరది అంటే ఇదే. కరెంటు వెలుగుల కొసం కష్టపడ్డది కాంగ్రెస్ పార్టీ అయితే, ఫలితం అనుభవిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటున్నారు విద్యుత్ కార్మికులు