ఆందోళనలో కొండపోచమ్మ రిజర్వాయర్ బహిలంపూర్ గ్రామస్థులు

దక్కని న్యాయమైన పరిహారం, ఆందోళనలో కొండపోచమ్మ రిజర్వాయర్ బహిలంపూర్ గ్రామస్థులు..

నిర్వాసిత గ్రామాల ప్రజలు ధర్నాకు దిగి పనులకు ఆటంకం కలిగించడం తో, RDO గ్రామస్తులతో చర్చలు జరిపి పరిహారం వివరాలు ప్రకటిస్తాం అని గత వారం చెప్పిన సంగతి విదితమే…

Image may contain: 30 people, people smiling, crowd

అయితే నిన్న RDO బహిలంపూర్ గ్రామానికి విచ్చేసి గ్రామస్థులకు పరిహారం అందే వివరాలను వెల్లడించారు…

గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఇంటి స్థలం, దాని పక్కన ఉండే ఖాళీ స్థలానికి మూడు సంవత్సరాల వాల్యుయేషన్ ని పరిగణలోకి తీసుకొని లెక్కించినట్టుగా తెలుస్తుంది…

ఇళ్లు నిర్మించి ఉన్న స్థలం , దాని పక్కన ఉండే స్థలం *1600 Sq Ft దాటితే గుంట* ప్రకారం పరిహారం ఇచ్చినట్టు సమాచారం….

1600 Sq Ft లోపు ఉన్న స్థలాలకు Rs. 920 రూపాయలు గా నిర్దారించారు…

ఇక ఇండ్ల వాల్యుయేషన్ అయితే చాలా తక్కువగా ఇచ్చినట్టు పలువురు గ్రామస్థులు వాపోయారు…

స్లాబ్ వేసి ఉన్న బిల్డింగ్ లకు Sq Ft కి Rs 1100 నుండి 1250 ప్రకారం లెక్కలు కట్టినట్టు సమాచారం…

ఇక పెంకుటిల్లులకు కేవలం Rs 500/- నుండి Rs 700/- వరకు మాత్రమే లెక్క కట్టినట్టు సమాచారం..

Image may contain: one or more people, crowd, wedding and outdoor

గ్రామంలో ఉన్న చాలా మంది నిర్వాసితుల ఇండ్లకు పరిహారం 2 నుండి 5 లక్షల లోపే రావడం తో ఆందోళన చెందుతున్నారు….
ఎవరు ఈ పరిహారాన్ని తీసుకోవద్దు అని, అవసరం అయితే మళ్ళీ పనులు ఆపి RDO తో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *